Kaizer News

Nacharam: అరుంధతి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఏడల

Nacharam: అరుంధతి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఏడల గణేష్ రాజీనామా!

· City - Hyderabad · hmtvlive.com

నాచారం: మల్లాపూర్ అరుంధతి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏడల గణేష్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గత రెండు సంవత్సరాలుగా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, తన పదవీకాలం ముగియడంతో ఆగస్టు 30, 2026న కమిటీ సభ్యులు, సంఘ సభ్యుల సమక్షంలో అధ్యక్ష పదవితో పాటు తన కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏడల గణేష్ మాట్లాడుతూ, తన పదవీకాలంలో సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేశానని తెలిపారు. తనకు సహకరించిన కమిటీ సభ్యులు, సంఘ సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుంధతి సంక్షేమ సంఘం సభ్యులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News