ఫామ్‌హౌస్ పరిసర భూముల పరిశీలనకు కాంగ్రెస్ నేతల పర్యటన కేటీఆర్ లీజుకు తీసుకున్న ఆస్తిపై ఎంపీ చామల కిరణ్ సంచలన ఆరోపణలు నిర్మాణాలు, నాలా, భూముల యాజమాన్యంపై విచారణ జరపాలని డిమాండ్ హైడ్రా కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎంపీ.. అధికారిక రికార్డులపై ఆసక్తి హైదరాబాద్, ఆంధ్రప్రభ : జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ మియాఖాన్‌గడ్డ పరిసరాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫామ్‌హౌస్ పరిసర భూముల వివరాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రైవేట్ ఆస్తి కావడంతో అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించరాదంటూ అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సులో ప్రజాభవన్ నుంచి జన్వాడకు బయలుదేరారు. భూముల రికార్డులు, యాజమాన్య వివరాలు, నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించడమే తమ ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జన్వాడకు చేరుకున్న ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫామ్‌హౌస్ భూములపై పలు ఆరోపణలు చేశారు. ఫామ్‌హౌస్ ఉన్న భూమి ప్రదీప్‌రెడ్డికి ఎలా వచ్చిందనే అంశంపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ ఈ ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ, తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం సంబంధిత లీజ్ ఒప్పందంపై కూడా ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్ నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా జరిగిందా? నాలా పరిధిలో ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా? నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలించాలని చామల కోరారు. గతంలో కూడా కాంగ్రెస్ నేతలు జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, నాలా అంశాలను ప్రస్తావించారు. ఫామ్‌హౌస్ నిర్మాణం, నాలాకు సంబంధించిన అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఎంపీ చామల ఫోన్‌లో మాట్లాడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే ఫామ్‌హౌస్ నిర్మాణానికి అనుమతులు లేవన్నది ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణ మాత్రమే. దీనిపై సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి అధికారికంగా తేల్చిన నివేదిక అందుబాటులోకి రావాల్సి ఉంది. అందువల్ల నిర్మాణం చట్టబద్ధతపై తుది నిర్ధారణ అధికారిక రికార్డులు, అనుమతులు, సంబంధిత శాఖల పరిశీలన ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, జన్వాడ ఫామ్‌హౌస్ యాజమాన్యంపై వస్తున్న రాజకీయ ఆరోపణలకు ఆస్తి యజమానిగా పేర్కొంటున్న ప్రదీప్‌రెడ్డి ఇప్పటికే స్పందించారు. భూమి, ఫామ్‌హౌస్ తనకే చెందుతాయని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడని, తన ఆస్తిని ఆయనకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. 2019లో నాలుగు ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, తన వద్ద ఆస్తికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ అధికారులకు భూమిపై ఏమైనా సందేహాలు ఉంటే నోటీసులు జారీ చేస్త