Shorts షాబాద్: షాబాద్ మండల కేంద్రంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కురిసిన ఈ వర్షం రైతులకు కొంతమేర ఊరటనిచ్చింది. గత రెండు రోజులుగా ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ వర్షం పంటలకు కొంత ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు