‘అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్'కి మూడు మిలియన్ల మంది యంగ్ సైంటిస్టులు పోటీపడుతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రత్యామ్నాయం చూపే ఆవిష్కరణలకు 25 వేల డాలర్ల గ్రాంట్‌ని ఇస్తారు. ఈ పోటీలో ఫైనల్ రౌండ్ జాబితాకు ఎంపికైన యువ సైంటిస్టుల్లో భారతీయ మూలాలున్న అరికా కుందు ఉంది. మిన్నెసొటాలో నివసిస్తున్న అరిక ఏడో తరగతి చదువుతున్నది. కూరగాయలు, పండ్లపై ఉండే పురుగుమందు అవశేషాలను తొలగించేందుకు ఆమె ఓ ఉపాయం కనుగొంది. ప్రకృతిలో కొన్ని పదార్థాలకు సహజంగానే రసాయనాలను పీల్చుకునే స్వభావం ఉంది