Kaizer News

Vadivukkarasi | ఆ వదంతులు నమ్మకండి.. నా ఆరోగ్యం బా

Vadivukkarasi | ఆ వదంతులు నమ్మకండి.. నా ఆరోగ్యం బాగానే ఉంది..!

· Entertainment · ntnews.com

Vadivukkarasi : సోషల్ మీడియాలో కొన్నిసార్లు అసత్య ప్రచారాలతో ఇబ్బంది పడిన సెలబ్రిటీలు, సినిమా వాళ్లు చాలామందే. తమ గురించిన ఆ తప్పుడు వార్తల్ని వారు స్వయంగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా తమిళ చిత్రసీమలో సీనియర్ నటి వడివుక్కరాశి (Vadivukkarasi) కూడా అదే పని చేశారు. తాను చనిపోయినట్టు ప్రచారమవుతున్న అసత్య వార్తలను ఆమె ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని ఆమె స్పష్టం చేశారు. శ్రేయోభిలాషులు, అభిమానులు ఎవరూ కూడా తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించిన వడివుక్కరాశి తన ఆరోగ్యంపై ప్రచారమవుతున్న అసత్య వార్తలను ఖండించారు. తాను చనిపోయినట్టు వస్తున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అబద్దపు కథనాలకు అడ్డుకట్ట వేస్తూ.. నేను బతికే ఉన్నాను, బాగానే ఉన్నాను చెప్పారీ వెటరన్ నటి. ఇటీవల వడివుక్కరాశి ఆరోగ్యం బాగాలేదని, ఆమె చనిపోయారని కొన్ని పోస్ట్‌లు వెలిశాయి. దాంతో.. అలాంటి అసత్య వార్తలకు చెక్ పెట్టేందుకు ఆమె మీడియా ముందుకొచ్చారు. థంథి టీవీతో మాట్లాడిన వడివుక్కరాశి.. తన ఆరోగ్యంపై ఆపోహలు వద్దని, తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియాలో పేర్కొన్నట్టు తానేమీ అనారోగ్యంతో బాధ పడడం లేదని వడివుక్కరాశి తేల్చి చెప్పారు. అబద్దపు వార్తలు చూసి.. తన గురించి వాకబు చేసిన శ్రేయాభిలాషులకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. చిత్రసీమలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు వడివుక్కరాశి. తమిళం, తెలుగు, మలయాళంతో పాటు.. కన్నడలోనూ ఆమెపలు పాత్రలు పోషించారు. ఇప్పటివరకూ 350కి పైగా సినిమాల్లో, 40కి పైగా టీవీ సీరియళ్లలో నటించారు. సినిమాల్లోకి రాకముందు తను టీచర్‌గా ఉద్యోగం చేసేవారు. కమల్ హాసన్‌ ‘సిగప్పు రొజక్కల్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారీ వెటరన్. చివరగా తను అర్జున్ దాస్‌ నటించిన ‘కాన్ సిటీ’లో డబ్బుల కోసం అనారోగ్యంతో బాధ పడే తల్లి పాత్రలో మెప్పించారు

Original source: ntnews.com
Read more on Kaizer News