Burning Topic: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి సీజనల్ వ్యాధుల తీవ్రత గణనీయంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా గత కొద్ది వారాలుగా స్వైన్ ఫ్లూ కేసుల పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఈ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఢిల్లీలోని అన్ని ప్రముఖ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది. ప్రతీ 20 మంది ఔట్ పేషంట్ రోగుల్లో 15 మందికి హెచ్1ఎన్1 పాజిటివ్‌గా తేలుతోందని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్ జెనెటిక్ మ్యుటేషన్ లేదా ప్రజల మధ్య సంబంధాలు పెరగడం వల్ల ఈ తీవ్రత ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 20 తేదీ నాటికి 200 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది వాటి సంఖ్య 8 రెట్లు పెరిగిందంటున్నారు. ఢిల్లీలో ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు 3,300 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. దేశ రాజధానితో పాటు పరిసర రాష్ట్రాల్లో స్వైన్ ఈ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పలువురు మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. స్వైన్ ఫ్లూ వ్యాప్తి తీరు, ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగితే, దానికి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. స్వైన్ ఫ్లూ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ చెబుతున్నారు. మరోవైపు కర్ణాటకలో కూడా స్వైన్‌ఫ్లూ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,212 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు బెంగళూరులోనే వెలుగు చూశాయి. బెంగళూరు వాతావరణం కారణంగా ఇక్కడ శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువకాలం ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ స్వైన్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 364 కేసులు నమోదవ్వగా, లక్నోలో ఒక మహిళ మరణించడంతో 75 జిల్లాల ఆసుపత్రులను హై అలర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ నియంత్రణలోనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో సాధారణ జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అధికారికంగా స్వైన్ ఫ్లూ కేసులు ఏవీ ఇంకా నిర్ధారణ కాలేదు గత కొన్నేళ్లుగా మన దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు ఓ నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం వైరస్‌లో జరిగే జన్యుపరమైన మార్పులు . నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్ర