Kaizer News

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుని కాంగ్రెస్‌ నేత వ

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుని కాంగ్రెస్‌ నేత వాగ్వాదం

· National - India · sakshi.com

తిరువనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ కాన్వాయ్‌ను కాంగ్రెస్‌ నేత అనిల్‌ కుమార్‌ అడ్డుకున్నారు. సతీశన్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారేనన్న విషయం తెలిసిందే. సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు జయంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు చెంపజంతికి వెళ్తున్న సతీశన్‌ కాన్వాయ్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్న దృశ్యాలు ఓ వీడియోలో కనిపించాయి. ఆ బృందం చెంతిలో శ్రీ నారాయణ గురు కార్యక్రమాన్ని నిర్వహించింది. సతీశన్‌ ఆ కార్యక్రమానికి హాజరు కావాలని వారు కోరుకున్నారు. సుమారు 30 సెకన్ల తర్వాత సతీశన్‌ వాహనం నుంచి బయటకు వచ్చారు. తిరువనంతపురం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నేత అనిల్‌ కుమార్‌తో ఆయన మాట్లాడుతున్నట్లు కనిపించింది. అనంతరం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొన్ని నిమిషాల తర్వాత సతీశన్‌ తిరిగి వాహనంలోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చెంతి కార్యక్రమం ఆయన అధికారిక కార్యక్రమాల జాబితాలో లేదని సతీశన్‌ కార్యాలయం తెలిపింది. కుమార్‌పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అక్రమంగా నిర్బంధించడం, నేరపూరిత బెదిరింపులు, ప్రభుత్వ ఉద్యోగి అధికారిక విధులు నిర్వర్తించకుండా బలప్రయోగంతో అడ్డుకోవడం వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి. నిందితుడు ముఖ్యమంత్రిని ‘నాకు కోపం వస్తే ఏం చేస్తావు?’ అని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రిని బహిరంగంగా అవమానించడంతో పాటు కాన్వాయ్‌ వెంట ఉన్న పోలీసు సిబ్బంది అధికారిక విధులను అడ్డుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వాహనాన్ని నేను అడ్డుకోలేదు: కుమార్‌ అయితే ముఖ్యమంత్రి వాహనాన్ని తాను అడ్డుకోలేదని కుమార్‌ అన్నారు. వాగ్వాదం సందర్భంగా సతీశన్‌ వ్యవహరించిన తీరును విమర్శిస్తూ, ‘‘కాలేజీ విద్యార్థులు గొడవపడుతున్నట్లు ప్రవర్తించారు’’ అని అన్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇది పార్టీలోని వర్గ రాజకీయాల్లో భాగం. వర్గపోరాటమే సమస్య’’ అని చెప్పారు. చెంతి కార్యక్రమ నిర్వాహకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా కొందరు, కొన్ని నెలల క్రితం సచివాలయంలో సతీశన్‌ను కలిసి కార్యక్రమాలకు ఆహ్వానించిన ఫొటోను తరువాత విడుదల చేశారు. కుమార్‌ అరెస్టుపై జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడు సుహైల్‌ షాజహాన్‌ కూడా నిరసన వ్యక్తం చేశారు. ‘‘వారు ఏ వర్గానికి, ఏ పక్షానికి చెందినవారైనా సరే, వ్యక్తిగతంగా చూస్తే పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి, నిరంతరం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్‌ కార్యకర్త అనిల్‌ను ఈ విధంగా అరెస్టు చేయడం చూసి నేను బాధపడ్డాను’’ అని శ్రీకార్యం పోలీస్‌ స్టేషన్‌లో ఆయనను కలిసిన అనంతరం విలేకరులతో చెప్పారు. ముఖ్యమంత్రి పట్ల కుమార్‌ అగౌరవంగా ప్రవర్తించినట్లు తాను చూడలేదని అన్నారు. కుమార్‌, ఆయన మద్దతుదారులు సతీశన్‌ వాహనాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణను కూడా షాజహాన్‌ ఖండించారు. నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర

Original source: sakshi.com
Read more on Kaizer News