Kaizer News

రోజూ గుప్పెడు తింటే శరీరంలోని కొవ్వును కోసి పడేస్త

రోజూ గుప్పెడు తింటే శరీరంలోని కొవ్వును కోసి పడేస్తాయ్.. గుండెను, జుట్టును బలంగా మారుస్తాయ్

· Health · tv9telugu.com

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్).. చూడటానికి చిన్నవిగా కనిపించినా, వాటిలో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని “ఆయిలీ సీడ్స్” అని కూడా అంటారు.. ఎందుకంటే వీటి నుండి ఆయిల్ తీస్తారు. అవిసె గింజలు మెరిసే, మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి.. గోధుమ, బంగారు గోధుమ రంగులలో లభ్యమవుతాయి. రెండు రకాలూ సమానమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. అవిసె గింజలు ప్రధానంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌కు (ప్రత్యేకంగా ఆల్ఫా-లినోలిక్ యాసిడ్ – ALA) మంచి వనరు. వాల్‌నట్‌ల మాదిరిగానే, అవిసె గింజలు కూడా ప్లాంట్-బేస్డ్ ALAను అందిస్తాయి. ఇది కాకుండా, ఇందులో విటమిన్లు, మినరల్స్, అధిక ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ (సుమారు 7 గ్రాములు) అవిసె గింజలలో చాలా తక్కువ కేలరీలు (30-40 కన్నా తక్కువ) ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, సుమారు 1.2 గ్రాముల ఫైబర్, 1-2 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయి. మన ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అవిసె గింజలలో ఉండే ALA కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది హృదయ సంబంధిత సమస్యలైన ఇస్కీమిక్ దాడులను నివారించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవిసె గింజలలో కరిగే, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి బవెల్ మూవ్‌మెంట్‌ను క్రమబద్ధీకరించి, సులభంగా మల విసర్జన జరిగేలా సహాయపడతాయి. అంతేకాకుండా, ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అవిసె గింజలలో లిగ్నాన్‌లు అనే ప్రత్యేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు ఇవి చాలా సహాయపడతాయి. ప్రీ-మెనోపాజ్, మెనోపాజ్ దశలోని మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినప్పుడు, అవిసె గింజలు ఈస్ట్రోజెన్-వంటి ప్రభావాన్ని అందిస్తాయి. పెద్దప్రేగు క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లను నివారించడంలో కూడా ఫైబర్, లిగ్నాన్‌లు సహాయపడతాయి. అవిసె గింజలలో మెగ్నీషియం – ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఖనిజ సాంద్రతను (బోన్ మినరల్ డెన్సిటీ) మెరుగుపరచి, ఆస్టియోపీనియా, ఆస్టియోపొరోసిస్ వంటి ఎముక సంబంధిత సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి అవిసె గింజలు ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో ఉండే అధిక ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఇది అనవసరమైన ఆహార కోరికలను తగ్గించి, ఆకలిని నియంత్రిస్తుంది. అవిసె గింజలు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. వీటిని లోపలికి తీసుకోవడం ద్వారా పోషకాలు జుట్టు పెరుగుదల, చర్మ కాంతికి దోహదపడతాయి. కొందరు వీటిని నానబెట్టి జెల్ లాగా చేసి జుట్టుకు కూడా అప్లై చేస్తారు. ఇది జుట్టును సిల్కీగా, షైనీగా మారుస్తుంది. అవిసె గింజల ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే, వాటిని సరిగ్గా తీసుకోవడం చాలా ముఖ్యం. వాటిని బాగా నమిలి తి

Original source: tv9telugu.com
Read more on Kaizer News