Kaizer News

65 ఏళ్ల వయసులో టిఫిన్‌ సర్వీస్! ఇవాళ ఏకంగా రూ. 2.5

65 ఏళ్ల వయసులో టిఫిన్‌ సర్వీస్! ఇవాళ ఏకంగా రూ. 2.5 కోట్లు..

· Business · sakshi.com

జీవితంలో ఏ దశలో ఉన్నా సరే కొత్తగా ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే..ఏవిధంగానైనా ముందుకు సాగిపోగలం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆమె. శరీరానికి వయసు తప్ప మనసుకి కాదు..యువకులకు తీసిపోని విధంగా కష్టపడగలమని నిరూపించి సంశయంతో కాలక్షేపం చేస్తున్న తన ఏజ్‌వాళ్లకు, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. వాస్తవంగా ఆరుపదుల వయసులో కాళ్ల నొప్పులు, చేతుల నొప్పులు అని బాధపడుతుంటారు. కానీ ఆ వయసులో తనకంటూ ఓ గుర్తింపు కోసం ఆరాటపడుతూ..చిన్నాగా ఏదైనా చేయాలనుకోవడమే విశేషం అనుకుంటే..ఏకంగా శారీరక శ్రమతో కూడిన ఆహార వ్యాపారం చేయాలనుకోవడం అతిపెద్ద సాహసం. నీ వల్ల కాదు అన్న వాళ్లే విస్తుపోయేలా సక్సెస్‌ అందుకుని ముందుకు సాగిపోతోంది ఈ బామ్మ. ఆ బామ్మే పాట్నాకు చెందిన దేవ్నీ దేవి. 65 ఏళ్ల వయస్సులో తనకంటూ గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలని అనిపించిందామెకు. బాధ్యతలు తీరిన సమయంలో కాయకష్టం చేసే పనివైపుకి మళ్లిందామె. చిన్న ఆలోచనతో మొదలైన చిన్న స్టార్లప్‌ లాంటి వ్యాపారం ఆమెది. ముందుగా ఇంట్లో వండిన సాధారణ భోజనాన్ని రూ. 20లకే విక్రయించే చిన్న టిఫిన్‌ ​సెంటర్‌ పెట్టుకుంది. చిన్నగా ప్రారంభమైన ఆమె టిఫిన్‌ సెంటర్‌ కాస్తా..అనతి కాలంలోనే విశేష ఆధరణ లభించి, ఎక్కువ ఆర్డర్లు రావడం మొదలైంది. అంతేగాదు ఆమె చేతి రుచి భోజనప్రియుల మనసుని గెలుచుకుంది. దాంతో చూస్తుండగానే చిన్న వ్యాపారం కాస్తా..రుచికి నమ్మకమైన పేరుగా గుర్తింపు తెచ్చుకుని రూ. 2.5 కోట్ల ఆహార వ్యాపారంగా మారింది. దేవ్నీ దేవి ఈ వ్యాపారం చేయాలనుకునే నిర్ణయానికి కుటుంబం నుంచి, బంధువుల నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా..కఠిన శ్రమ, ఓర్పుతో విజయం సాధించి చూపారామె. నాణ్యత, రుచిలో రాజీపడకుండా ఎంతో శ్రద్ధతో తాజగా వండిన భోజనం అందించి కార్మికులు, విద్యార్థులు, కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. అది కూడా సరసమైన ధరలో మంచి భోజనం అందించే టిపిన్‌ సెంటర్‌గా పేరుతెచ్చుకునేలా కష్టపడింది. ఆ శ్రమకు తగిన గుర్తింపు లభించేలా పెద్ద ఆహార వ్యాపారంగా విస్తరించింది. అంతేగాదు క్యాటరింగ్‌ సేవలను ప్రారంభించి, ఎక్కువమందికి తన సర్వీస్‌ని అందించేలా రెస్టారెంట్‌ను కూడా తెరిచారామె. ఆరోజు ఈ వయసులోనా అని ముఖం చిట్లించిన వాళ్లే సిగ్గుపడేలా ఉవ్వెత్తున ఎగిసిపడేలా అందనంత ఎత్తుకు ఎదిగింది. కొత్తగా ఏ పని చేయాలన్న లేదా ప్రారంభించి విజయం సాధించడానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు..అది మీ మనస్సులోని సంకల్పం ముందు నిలువదు అని చెప్పే స్ఫూర్తిదాయక కథ . దైర్యం, ఓర్పు, నిరంత కృషి ఉన్నవాళ్లకి అపజయం అన్నదే కలగదు అనే మాటకు దేవ్నీ దేవి కథే ఓ ఉదాహరణ. ( చదవండి: అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..! ) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ వేట.. బ్యాంక్ మిస్ర్ కు బిగ్ షాక్! నన్ను కొట్టి ఫోన్ లాక్కొని.. బీజేపీ రవిప్రకాష్ కిడ్నాప్ పై భార్య సంచలన కామెంట్స్ టన్నెళ్లల

Original source: sakshi.com
Read more on Kaizer News