Kaizer News

LB Nagar: 118 జీవో బాధితులకు శుభవార్త.. నేడు సరూర్

LB Nagar: 118 జీవో బాధితులకు శుభవార్త.. నేడు సరూర్‌నగర్‌లో మంత్రుల సభ!

· City - Hyderabad · hmtvlive.com

Shorts LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న 118 జీవో సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. నేడు సరూర్‌నగర్‌లో కీలక సభ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సభకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. 118 జీవో బాధితులకు పూర్తి హక్కు పత్రాల మంజూరుకు సంబంధించిన ప్రక్రియపై ఈ సభలో కీలక ప్రకటన చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 118 జీవో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించడంతో పాటు.. బాధితులకు హక్కు పత్రాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా 118 జీవో బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పిలుపునిచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News