Kaizer News

జిల్లా ఆటగాళ్లను దేశానికి ఆడేలా చేస్తాం : భారత మాజ

జిల్లా ఆటగాళ్లను దేశానికి ఆడేలా చేస్తాం : భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

· National - India · v6velugu.com

తిమ్మాపూర్, వెలుగు: జిల్లా ఆటగాళ్లను జాతీయస్థాయిలో ఆడేలా చేస్తామని, వచ్చే రెండేండ్లలో అన్ని జిల్లాల నుంచి కనీసం ఐదుగురు ఆటగాళ్లను జాతీయ స్థాయికి ఎంపిక చేయడమే తమ లక్ష్యమని భారత మాజీ క్రికెటర్, హెచ్​సీఏ ఆపరేషన్స్​ కమిటీ సీవోసీ అధిపతి అంబటి రాయుడు అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా అలుగునూర్​లో నిర్మించిన వెలిచాల జగపతి రావు మెమోరియల్​ క్రికెట్ గ్రౌండ్‌‌‌‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మన ఆటగాళ్లలో మంచి ప్రతిభ ఉందని, ప్రోత్సాహం అందిస్తే కచ్చితంగా దేశానికి ఆడే అవకాశం ఉందన్నారు. ఆటగాళ్ల ఎంపికలో గతంలో హెచ్​సీఏ చేసిన పొరపాట్లను సరిదిద్దుతున్నామని, పారదర్శకంగా సెలెక్షన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కనీసం పదెకరాల స్థలం కేటాయించి క్రికెట్‌‌‌‌కు ఆడేందుకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ చైర్మన్, హెచ్​సీఏ మాజీ కార్యదర్శి టి.శేషనారాయణ్, హెచ్​సీఏ మహిళా క్రికెట్​ అభివృద్ధి విభాగం అధిపతి సునీత ఆనంద్, కరీంనగర్ క్రికెట్​అసోసియేషన్ ప్రెసిడెంట్​ వి.ఆగంరావు, హెచ్​సీఏ సభ్యులు వెంకటేశ్వరరావు, వెంకట్​రెడ్డి, మహేందర్​గౌడ్​ తదితరులు పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News