Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బెలగావిలో చికెన్ ముక్కల విషయంలో తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఆదివారం జరిగిన పార్టీలో స్నేహితుల మధ్య గొడవ జరగడంతో సీతారామ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడి స్నేహితుడు అరుణ్ వంట కత్తితో ఛాతిలో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సీతారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతారామ్, అరుణ్ ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మరో నలుగురితో కలిసి వారు నివాసం ఉంటున్నారు. ఆదివారం అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా చికెన్ తింటుండగా సీతారామ్ ఎక్కువ ముక్కలు తింటున్నాడని అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన అరుణ్ వంటకు ఉపయోగించే కత్తితో సీతారామ్ ఛాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరుణ్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు