అయోధ్య: అయోధ్యలోని రామమందిరానికి సంబంధించి ఒక విస్తుపోయే ఉదంతం వెలుగుచూసింది. మందిర సిబ్బంది సంక్షేమం, సౌకర్యాల నిమిత్తం చెన్నైకి చెందిన ఓ మహిళా భక్తురాలు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.4 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. అయితే ట్రస్ట్ ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా.. ఆమె ఖాతాలో కేవలం రూ.3 మాత్రమే ఉన్నట్లు తేలింది. తగినంత నగదు నిల్వ లేకపోవడంతో ఆ చెక్కు బౌన్స్ అయింది. సమాచారం ప్రకారం, తాను అందించే రూ.4 కోట్లను ప్రత్యేకంగా రామమందిర ఉద్యోగుల వసతులకే ఖర్చు చేయాలని సదరు మహిళ కోరారు. దీనిపై ట్రస్ట్ నుంచి లిఖితపూర్వక హామీని కూడా అడిగారు. అయితే, ట్రస్ట్ అటువంటి హామీ ఏదీ ఇవ్వలేదని తెలిసింది. కాగా, ఆమె ఆలయానికి విడిగా మరో రూ.10 వేల విరాళాన్ని అందజేశారు. ఖాతాలో నిధులు లేకున్నా భారీ మొత్తానికి చెక్కు జారీ చేసినందుకు గాను, ఆ మహిళకు నోటీసులు పంపేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనల ప్రకారం ఆమె వివరణ కోరడంతో పాటు, అవసరమైతే చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రస్ట్ ప్రతినిధులు సదరు మహిళతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ట్రస్ట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో 2020లో నిర్వహించిన నిధి సమర్పణ ప్రచారంలోనూ సాంకేతిక, ఇతర కారణాలతో సుమారు రూ.100 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్ అయ్యాయి. వాటిలో చాలా వరకు తర్వాత రికవరీ కాగా, దాదాపు రూ.22 కోట్ల మేర చెక్కుల రికవరీ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆలయానికి నెలకు నగదు, ఆన్‌లైన్, చెక్కుల రూపంలో రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు విరాళాలు అందుతున్నాయి. ఇందులో చెక్కుల ద్వారానే రూ.1 నుంచి రూ.1.5 కోట్లు వస్తుండటంతో, ఇకపై భారీ విరాళాల చెక్కుల క్లియరింగ్‌లో ట్రస్ట్ మరింత అప్రమత్తత పాటించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: శవాల దిబ్బల్లో ఆప్తుల కోసం అన్వేషణ.. మిన్నంటుతున్న రోదనలు! ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?