Kaizer News

Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిక

Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఫ్యూచర్ సిటీలో నిర్మాణం!

· City - Hyderabad · hmtvlive.com

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. క్రీడా మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం రికార్డుల్లో ఉంది. ఆ స్టేడియం కెపాసిటీ సుమారు 1.32 లక్షలు కాగా, ఇప్పుడు దానిని మించిపోయేలా అంతకంటే ఎక్కువ మంది అభిమానులు ఒకేసారి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించే సామర్థ్యంతో హైదరాబాద్‌లో ఈ నూతన క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం జరగనుందని వార్తలు వస్తున్నాయి. క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది డిసెంబరు నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక స్టేడియానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భారీ నిర్మాణానికి అవసరమైన భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించనుంది. స్థల సేకరణ, కేటాయింపు ప్రక్రియలు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. భూమి కేటాయింపు అనంతరం స్టేడియం నిర్మాణ బాధ్యతలతో పాటు భవిష్యత్తులో నిర్వహణ బాధ్యతలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పూర్తిగా తన భుజాలపై వేసుకోనుందని క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. బీసీసీఐ ఆధ్వర్యంలో రూ. వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యున్నత ప్రమాణాలతో ఈ స్టేడియాన్ని నిర్మించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ మెగా క్రీడా ఈవెంట్లకు సైతం ఆతిథ్యం ఇచ్చే స్థాయికి హైదరాబాద్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం క్రీడా శాఖ అధికారులు విదేశాల్లోని ప్రఖ్యాత స్టేడియంల నమూనాలను సైతం అధ్యయనం చేస్తున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రస్తుతం సుమారు 40 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం మాత్రమే ఉంది. ప్రతిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినప్పుడు టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బ్లాక్‌లో టికెట్లు రూ. 10 వేలు పలికే పరిస్థితులు కూడా చూశాం. అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాత స్టేడియం సామర్థ్యం ఏమాత్రం సరిపోవడం లేదని భావించిన ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఈ మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. ఈ కొత్త స్టేడియం అందుబాటులోకి వస్తే నగరంలో క్రీడా పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా ప్రత్యక్షంగా లభిస్తాయి. దేశ విదేశీ క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించేలా అద్భుతమైన డిజైన్‌తో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 2017లో వెబ్ జర్నలిస్ట

Original source: hmtvlive.com
Read more on Kaizer News