Kaizer News

ప్రేమనే ఊరిలో...

ప్రేమనే ఊరిలో...

· Entertainment · sakshi.com

‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిల్, టీజర్‌ చాలా బాగుంది. టీజర్‌లో శ్రీకాంత్‌గారి వాయిస్‌ ఓవర్‌ ఆకట్టుకుంది. నటీనటులు తెరపై అద్భుతంగా కనిపించారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ మంచి పేరు రావాలి, అలాగే నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్‌ కామాక్షి భాస్కర్ల పేర్కొన్నారు. శ్రీరామ్, రామికా శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్‌ కుమార్‌ దర్శకత్వంలో మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌.కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్‌ కొండేటి, మమత దేవేంద్ర ఎం. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. సునాద్‌ గౌతమ్‌ సంగీతం అందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌కి కామాక్షి భాస్కర్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చందు శ్రీనివాస్‌ మాట్లాడుతూ–‘‘ప్రేమనే ఊరిలో’తో నిర్మాతగా మారాను. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘నేను గతంలో చేసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్‌ మాల్‌’ సినిమాల స్థాయిలో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుంది’’ అని సురేష్‌ కొండేటి తెలిపారు. ‘‘నాకు కన్నడ ఇండస్ట్రీతో పాటుగా తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం’’ అని శ్రీరామ్‌ పేర్కొన్నారు. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News