Kaizer News

Lingojiguda: లింగోజిగూడలో కాలనీ సంక్షేమ సంఘాలతో ఎమ

Lingojiguda: లింగోజిగూడలో కాలనీ సంక్షేమ సంఘాలతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ

· City - Hyderabad · hmtvlive.com

Shorts ఎల్బీనగర్: లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో పలు కాలనీల అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి కృషితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కొన్ని కాలనీలలో డ్రైనేజీ సమస్యలు,రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలు ఇంకా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కాలనీ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, భారస నాయకులు వెంకటేశ్వరరావు, తిలక్ రావు, జగన్నాథ్ రెడ్డి, తోట రాజశేఖర్ రెడ్డి, రాకేష్ ఠాగూర్, గంగపుత్ర భాస్కర్, నరసింహగుప్త, ఇంద్రజి, శ్రీధర్, దయానంద్, ఆశిష్, పార్వతి, దేవి, ప్రభావతి మరియు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News