Kaizer News

నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా..

నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా..

· Entertainment · ntnews.com

శ్రవణ్‌, మలైకా టి వాసుపల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోర – లూనార్‌ లవ్‌ బర్డ్‌’. మంగా శ్రీనివాస్‌ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్‌ 9న సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కానున్నది. మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా.. గుండెల్లో కోవెల కట్టి ఆరాధిస్తున్నా..’ అంటూ సాగే పాటను మేకర్స్‌ శనివారం విడుదల చేశారు. అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ ఈ పాటను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. రామజోయ్యశాస్త్రి రాసిన ఈ పాటను హెన్రీ స్వరపరచగా, శ్రీకృష్ణ ఆలపించారు. రాజు కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ అని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: గోపీకృష్ణ

Original source: ntnews.com
Read more on Kaizer News