సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సంచలనం, నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambya)భారత సైన్యంనుంచి ముందస్తు పదవీ విరమణ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద సహాయకుడిగా (ADC)గా పనిచేస్తున్న సమయంలో అనేక అధికారిక, దౌత్య, జాతీయ వేడుకల్లో ఆయన రాష్ట్రపతితో పాటు కనిపించి ఆకర్షించేవారు. గంభీరమైన రూపం, క్రమశిక్షణ సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో అభిమానులు ఆయన వీడియోలతో రకరకాల ఎడిట్స్ చేస్తూ "National Crush" (నేషనల్ క్రష్) అని పిలవడం ప్రారంభించారు. అలా ఇంటర్నెట్ సంచలనంగా మారిన మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్, ఆర్మీని ఎందుకు వీడారు అనేది హాట్ టాపిక్‌గా నిలిచింది. మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ 12 ఏళ్ల సైనిక సేవల అనంతరం వ్యక్తిగత , కుటుంబ కారణాల వల్లే రిటైర్మెంట్ (Premature Retirement) తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమనీ, చిన్నతనం నుండి ఆర్మీ యూనిఫాం వేసుకోవడం తన కల అని, అయితే ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని పరిస్థితులు అనుకోకుండా దిశను మారుస్తాయని పేర్కొన్నారు. ఆర్మీ సేవల్లో తనకు ఎలాంటి వృత్తిపరమైన అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలను రిషబ్ ఖండించారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదనివెల్లడించారు. ఆర్మీ వదిలినప్పటికీ వేరే రూపంలో దేశానికి సేవ చేస్తూనే ఉంటానని, తన తదుపరి ప్రణాళికలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. రాష్ట్రపతి భవన్ అధికారిక డిజిటల్ ఫోటో లైబ్రరీ, మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్‌ను పదవీ విరమణ చేసిన మాజీ ఏడీసీగా పేర్కొంటూ ఆయన పదవీ విరమణ విషయాన్ని బహిరంగపరచడంతో, ఈ మేజర్ మళ్లీ వార్తల్లో నిలిచారు. సైనిక కుటుంబంలో పెరిగిన మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్, జమ్మూ అండ్ కాశ్మీర్‌కు చెందిన డోగ్రా రాజ్‌పుత్ కుటుంబానికి చెందినవారు. 2023 మార్చిలో సాయుధ దళాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, గోప్యమైన బాధ్యతలలో ఒకటైన ప్రెసిడెంట్ ఏడీసీ పదవికి ఎంపికయ్యారు. లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్ నుండి ఎయిడ్-డి-క్యాంప్ పోస్టుల వరకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్లు, ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఒక ఏడాది ఆ తర్వాత, సుమారు ఎనిమిదేళ్లు కమిషన్డ్ ఆఫీసర్‌గా మొత్తం 12 ఏళ్ల పాటు భారత సైన్యానికి సేవలందించారు. 2021లో జాట్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా తొలిసారిగా ప్రాచుర్యం పొందారు. ఈ సందర్భంగా 'బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్' ట్రోఫీ గెలుచుకున్నారు. అత్యంత కష్టతరమైన డాగర్స్ అని పిలిచే 4 పారా (స్పెషల్ ఫోర్సెస్) లో సేవలు అందించి 'బలిదాన్ బ్యాడ్జ్' సాధించడం ఆయన సామర్థ్యానికి నిదర్శనం. అధికారికంగా పదవీ విరమణ తర్వాత, ఈ నెల (ఆగస్టు, 2026) 21న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. రాష్ట్రపతి మార్గదర్శకత్వానికి, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపే అవకాశంగా ఈ పర్యటనను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అభివర్ణించారు. విద్య, కరియర్ 2013లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షలో ఉత్తీర్ణులై, 2014లో 133వ NDA కోర్సులో చేరారు. 2017లో అంతర్జాతీయ సంబం