Kaizer News

Salman Khan | 60 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ఊరమాస్ ల

Salman Khan | 60 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ఊరమాస్ లుక్.. ట్రోలర్లకు టీ-షర్ట్ తీసి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్!

· Entertainment · ntnews.com

Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మరియు ‘బిగ్‌బాస్’ లైవ్ షోలో ఆయన చేసిన రచ్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన ఆరోగ్యం, ట్రోలింగ్ మరియు బిగ్‌బాస్ ప్రోమోపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని సల్మాన్ తెలిపారు. హౌస్‌లో కంటెస్టెంట్ ఖాజీ తన ఆరోగ్యాన్ని వినోదం కోసం ఉపయోగించుకోవడాన్ని తప్పుబట్టే క్రమంలో తాము స్పందించామని, అయితే బిగ్ బాస్ ప్రోమోను అలా కట్ చేసి ఉండాల్సింది కాదని ఆయన పేర్కొన్నారు. అలా చేయడం వల్ల అసలు ఉద్దేశమే దెబ్బతిన్నదని చెబుతూ, నిర్వాహకుల తరఫున ఆయన క్షమాపణలు కోరారు. తన వయసుపై వస్తున్న విమర్శలకు సల్మాన్ తనదైన శైలిలో గట్టి బదులిచ్చారు. కొంతమంది తన వయసైపోయిందని ట్రోల్ చేస్తున్నారని, కచ్చితంగా తనకు ఇప్పుడు 60 ఏళ్లు అని, అందరూ ఎప్పుడూ ‘మైనే ప్యార్ కియా’ సినిమా నాటిలాగే ఉండలేరంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అలాగే కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత బరువు పెరిగారంటూ వస్తున్న ట్రోలింగ్‌పై మండిపడ్డారు. ప్రెగ్నెన్సీ తర్వాత ప్రతి ఒక్కరూ బరువు పెరుగుతారని, రీఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆమె పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌లోకి వస్తారని ఆమెను సమర్థించారు. మ‌రోవైపు ఈ వివాదాలన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ ‘బిగ్‌బాస్’ లైవ్ టెలికాస్ట్‌లో సల్మాన్ ఖాన్ తన టీ-షర్ట్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 60 ఏళ్ల వయసులోనూ ఎవరైనా అసూయపడేలాంటి అద్భుతమైన ఫిజిక్‌ను ప్రదర్శించి ట్రోలర్ల నోళ్ళు మూయించారు. తాను ఎందుకు ‘ఓజీ ఫిట్‌నెస్ ఐకాన్’ అనే విషయాన్ని మరోసారి నిరూపించి అభిమానులను ఉర్రూతలూగించారు

Original source: ntnews.com
Read more on Kaizer News