నేచరల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ (The Paradise). దసరా తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతోన్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సెప్టెంబర్ 24న (శుక్రవారం) తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో పాటు టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. దీనిపై ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ ఉంది. కొంతమంది మాత్రం సోషల్ మీడియా వేదికగా మీమ్స్‌తో ట్రోల్స్ చేస్తున్నారు. 'ఎవ్వరి ముఖంలోనూ నవ్వు లేదు. సినిమాపై నమ్మకం లేనట్టుంది.' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలకు నానితో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ కూడా తమదైన శైలిలో ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కౌంటర్ ఇచ్చారు. తన ముఖం ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటుందని చెప్పిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల... స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన రోజులు గుర్తు చేసుకున్నారు. 'నేను సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరడానికి నాలుగేళ్లు గేటు బయటే నిలబడ్డాను. ఎన్నో కష్టాలు దాటి ఈ స్థాయికి వచ్చా. నా ముఖం ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటుంది. అంత మాత్రాన నవ్వు లేదని సినిమాపై నమ్మకం లేదని కాదు. ఇప్పుడున్న హడావిడిలో ఏదో ఒకటి కట్ చేసి ట్రైలర్ ఇవ్వడం నాకిష్టం లేదు. టైం కూడా కేటాయించలేం. మనం చిన్నప్పుడు ఏమీ చూడకుండానే థియేటర్‌లోకి వెళ్లి ప్రతీ మూమెంట్‌కు సర్ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు పర్సనల్‌గా అలా నేరుగా థియేటర్‌కు వెళ్లి సర్ప్రైజ్ అవ్వడమే ఇష్టం.' అంటూ కూల్‌గా ఆన్సర్ ఇచ్చారు. ఈ కథలో రియల్ లైఫ్ సంఘటనలు, కొన్ని పాత్రలు, ఫిక్షన్ మూడూ ఉన్నాయని చెప్పారు శ్రీకాంత్ ఓదెల. 'హీరోకి జడలు అనే కాన్సెప్ట్ నా జీవతం నుంచే తీసుకున్నా. మా అమ్మ తనకు ఆడపిల్ల పుట్టలేదన్న ముచ్చట నా ద్వారా తీర్చుకుంది. గోదావరి ఖని, ఆదిలాబాద్ పరిసరాల్లో నేను చూసిన వాస్తవ ఘటనలతో ఈ కథ అల్లుకున్నా. కథ రీత్యా నాని లుక్‌కు బలమైన నేపథ్యం, ఎమోషన్ ఉన్నాయి. నేచరల్ స్టార్ ఎలాంటి సందేహం లేకుండా క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో జడలే ఆయన ఆయుధం. దీంట్లో తల్లీ కొడుకుల ఎమోషన్, సామాజిక అంశాలు, తిరుగుబాటు అన్నీ అంశాలు ఉంటాయి. థియేటర్ నుంచి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు యాక్షన్ కన్నా ఎమోషనే వారి రక్తాన్ని ఎక్కువ మరిగిస్తుంది.' అంటూ ఇంటర్వ్యూలో తెలిపారు. .. డైరెక్టర్ వెరీ హ్యాపీ 'ఒక్కడి ముఖంలోనూ నవ్వు లేదు.' అంటూ వచ్చిన విమర్శలపై నాని కూడా అంతే కూల్ అండ్ స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చారు. 'శ్రీకాంత్ ఎప్పుడూ చాలా సీరియస్‌గా సినిమా పనుల్లో లీనమై ఉంటాడు. అతని నైజమే అంత. ఈ మూవీలో ఎమోషనల్, యాక్షన్ అంశాలు అందరికీ కనెక్ట్ అవుతాయి.' అంటూ రిప్లై ఇచ్చాారు. సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. .. ఎందులో స్ట్రీమింగ్ అంటే? గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగ