Kaizer News

తల్లీ కొడుకుల కథ

తల్లీ కొడుకుల కథ

· Entertainment · ntnews.com

‘ప్యారడైజ్‌’ నా కెరీర్‌లోనే ప్రత్యేకం. నేను ఎక్కువ రోజులు షూటింగ్‌ చేసిన సినిమా ఇదే. అలాగే ఎక్కువ కష్టపడ్డ సినిమా కూడా ఇదే. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి అందించడానికి మేం ఎక్కడా రాజీ పడకుండా పనిచేశాం. ఈ యాక్షన్‌ డ్రామాను తప్పకుండా బిగ్‌ స్క్రీన్‌పై అంతా ఎంజాయ్‌ చేస్తారు. ‘ప్యారడైజ్‌’ లాంటి ఇంటెన్సిటీ, వరల్డ్‌ బిల్డింగ్‌, ఎనర్జీ, ఎమోషన్స్‌ ఉన్న యాక్షన్‌ సినిమా ఇప్పటివరకూ రాలేదు’ అని అగ్ర కథానాయకుడు నాని అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘ది ప్యారడైజ్‌’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా బెంగళూరు ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘ఈ సినిమాలోని ‘జడల్‌’ లుక్‌ వెనుక ఒక మంచి ఉద్దేశం ఉన్నది. ఇది తల్లీకొడుకుల కథ. ఇది అన్నింటికంటే గొప్ప ఎమోషన్‌. ఇందులో తల్లీకొడుకు మధ్య ఉండే సంఘర్షణ కొత్తగా ఉంటుంది. కన్నడలో నా పాత్రకు దీక్షిత్‌ డబ్బింగ్‌ చెప్పాడు’ అని నాని తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News