గత మూడు, నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఆగస్టు 29, శనివారం నాటికి స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం శనివారం ఉదయం 9 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,140 వద్ద నమోదైంది. అలాగే 22 క్యారెట్ల (10 గ్రాముల) ఆర్నమెంటల్ పసిడి ధర రూ. 1,47,710 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,20,860 కి చేరింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 2,64,900 వద్ద స్థిరపడింది