Kaizer News

RBI: రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచ

RBI: రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో క్షణాల్లో గుర్తించండి!

· Business · tv9telugu.com

RBI: మార్కెట్‌లో నగదు లావాదేవీలు చేసే సమయంలో నకిలీ నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువగా చలామణిలో ఉండే రూ.500 నోట్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. నకిలీ నోట్లను గుర్తించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచించిన కొన్ని భద్రతా లక్షణాలను పరిశీలించడం ద్వారా అసలు నోటును గుర్తించవచ్చు. రూ.500 నోటుపై ఉండే కొన్ని సూక్ష్మ అక్షరాలు సాధారణంగా కంటికి వెంటనే కనిపించవు. అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే నోటు అసలుదా, నకిలీదా అనే విషయాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. ఇది కూడా చదవండి: House Construction: ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ 9 తప్పులు చేయకపోతే మీ భవనం నూరేళ్లు పదిలం! రూ.500 అసలు నోటులో మహాత్మా గాంధీ చిత్రానికి సంబంధించిన శాలువా మడతల వద్ద చాలా చిన్న అక్షరాల్లో ‘भारत’, ‘INDIA’ అని ముద్రించి ఉంటుంది. ఈ మైక్రో లెటరింగ్‌ను నిశితంగా పరిశీలిస్తే కనిపిస్తుంది. నోటులోని మరో ముఖ్యమైన భద్రతా లక్షణం మహాత్మా గాంధీ కళ్లద్దాల ఫ్రేమ్‌ వద్ద ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ చాలా చిన్న అక్షరాల్లో ‘RBI’ అని కనిపిస్తుంది. నోటుకు ఎడమ వైపున కూడా మైక్రో టెక్స్ట్ ఉంటుంది. అందులో ‘RBI500INDIA’ అనే అక్షరాలు కనిపిస్తాయి. నోటును జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ వివరాలను గుర్తించవచ్చు. ఎవరైనా రూ.500 నోటు ఇచ్చినప్పుడు తొందరపడి జేబులో పెట్టుకోకుండా కొన్ని సెకన్లు నోటును పరిశీలించడం మంచిది. ముఖ్యంగా గాంధీజీ కళ్లద్దాల వద్ద RBI, శాలువా మడతల వద్ద భారత్/INDIA, ఎడమవైపు RBI500INDIA వంటి మైక్రో టెక్స్ట్‌లను చెక్ చేయవచ్చు. అయితే ఒక్క లక్షణాన్ని చూసి మాత్రమే నోటు అసలుదని తేల్చకుండా, నోటులోని ఇతర భద్రతా లక్షణాలను కూడా పరిశీలించడం మంచిది. నోటు విలువను గుర్తించడంలో సహాయపడేందుకు RBI MANI (Mobile Aided Note Identifier) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ Android, iOS ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఫోన్ కెమెరాతో నోటును స్కాన్ చేస్తే దాని విలువను గుర్తించడంలో యాప్ సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ యాప్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే పనిచేసే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. పాతగా, ముడతలు పడిన లేదా కొంత మురికిగా ఉన్న నోట్లను కూడా గుర్తించగలదని తెలిపింది. రోజువారీ కొనుగోళ్లు, నగదు లావాదేవీల సమయంలో నకిలీ నోటు చేతికి వస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే రూ.500 నోటు తీసుకునే సమయంలో కొన్ని సెకన్లు వెచ్చించి దాని భద్రతా లక్షణాలను పరిశీలించడం మంచిది. ఈ వివరాలను పరిశీలించడం ద్వారా నోటు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండవచ్చు. ఇది కూడా చదవండి: House Wiring: హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్ల మధ్య తేడాలివే! మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Original source: tv9telugu.com
Read more on Kaizer News