Kaizer News

Yanam: యానాంలో పులసల హడావుడి రికార్డు స్థాయిలో ₹24

Yanam: యానాంలో పులసల హడావుడి రికార్డు స్థాయిలో ₹24 వేలు పలికిన చేప!

· Business · hmtvlive.com

Yanam: యానాం, రెండు తెలుగు రాష్ట్రాలలో మాంసహార ప్రియులకు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాంలో మొదలైంది. యానాం గౌతమి గోదావరికి ఎర్రనీరు పోటెత్తిన సమయంలో పులసలు లభ్యమవుతాయి. ఇటీవల పులసల జాడ లేనప్పటికీ శుక్రవారం యానాం మార్కెట్కు యానాంకు వచ్చిన పులస 24,000/-ధర పలికింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు రెండు కేజీల బరువు కలిగిన పులస మత్యకారులకు చిక్కింది. దీనిని యానాం మార్కెట్లో నాటి పార్వతి 24వేలకు దక్కించుకుంది. దానిపై అధనంగా కొంతమేర వేసుకుని విక్రయించడం జరుగుతుందని తెలిపారు. గోదావరికి వరద నీరు రావడంతో 15000, రెండో పులుసు 14000 ధర పలకగా ఇప్పుడు వచ్చిన మూడో పులుసు 24000 అత్యధిక ధర పలికిందని తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News