Kaizer News

అమెరికా: సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం

అమెరికా: సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం

· National - India · sakshi.com

అమెరికాలోని సౌత్‌ కరోనాలిలో కాల్పుల కలకలం రేగింది. దుండగుడి కాల్పుల్లో పోలీస్‌ అధికారి మృతి చెందారు. మరో పోలీస్‌ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. నిందితుడికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన పోలీస్‌ అధికారి.. రెండు సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. ఓ వ్యక్తి తన ఇంటి వద్ద ఆస్తులను ధ్వంసం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు అధికారి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అనుమానితుడు ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ మహిళ అనుమానితుడి రూపురేఖలు.. అతని వాహనం వివరాలను అధికారికి ఇచ్చింది. అయితే, కొద్ది నిమిషాల తర్వాత, ఆ మహిళ చెప్పిన వివరాలకు సరిపోలే వాహనం సమీపంలో ఒక వ్యక్తిని గమనించారు. దీంతో అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు, నిందితుడికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్

Original source: sakshi.com
Read more on Kaizer News