Kaizer News

Hyderabad IMAX | 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. డిసెంబర్

Hyderabad IMAX | 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. డిసెంబర్‌లో హైదరాబాద్‌కు ఐమాక్స్‌?

· City - Hyderabad · ntnews.com

HyderabadIMAX | హైదరాబాద్‌లోని సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ శుభవార్త వచ్చేసింది. నగరంలో గత 12 ఏళ్లుగా సరైన ఐమాక్స్‌ (IMAX) అనుభూతి లేదనే వెలితిని తీర్చేందుకు ఎట్టకేలకు అద్భుతమైన అవకాశం రాబోతోంది. చారిత్రాత్మక ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీ (AMB Classic Victory) ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో కూడిన కొత్త ఐమ్యాక్స్ స్క్రీన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త ఐమ్యాక్స్ స్క్రీన్ ప్రారంభాన్ని మరింత గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ పార్ట్ త్రీ’ (Dune 3) చిత్రాన్ని ఫస్ట్ ఓపెనింగ్ మూవీగా ప్రదర్శించే అవకాశం ఉందనే వార్త సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అధునాతన లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, అత్యుత్తమ 12-ఛానల్ సౌండ్ సిస్టమ్‌తో రానున్న ఈ స్క్రీన్ సినిమా చూసే అనుభూతినే పూర్తిగా మార్చేయనుంది. ఇక ఈ సినిమా విశేషాలతో పాటు, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) లాంటి భారీ చిత్రాలను ఈ బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఆ మ్యాజిక్ వేరే లెవెల్‌లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించే విజువల్ వండర్స్‌ను ఇలాంటి సరికొత్త ఐమ్యాక్స్ స్క్రీన్‌లపై వీక్షించడం ప్రేక్షకులకు నిజంగా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మొత్తానికి టాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ చిత్రాలను కూడా బిగ్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేసే రోజులు వచ్చేయడంతో నగర సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News