Kaizer News

మరో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ కపుల్…

మరో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ కపుల్…

· Entertainment · prabhanews.com

ఆంధ్రప్రభ : బాలీవుడ్‌ స్టార్‌ దంపతులు దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ మరోసారి తల్లిదండ్రులయ్యారు. వీరిద్దరూ రెండో ఆడబిడ్డకు స్వాగతం పలికారు. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ చేశారు. “వెల్‌కమ్‌ బేబీ గర్ల్‌.. 19/9/2026” అంటూ దీపికా, రణ్‌వీర్‌ సంయుక్తంగా పోస్ట్‌ చేశారు. చివరలో తమ కుమార్తె దువా, దీపికా, రణ్‌వీర్‌ పేర్లను జోడించారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెండో బిడ్డ రాకకు ముందు దీపికా, రణ్‌వీర్‌ ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2024లో తొలి సంతానం దువా జన్మించే ముందు కూడా ఈ జంట సిద్ధివినాయకుడిని దర్శించుకుంది. తాజాగా మరోసారి ఆలయ సందర్శన అనంతరం తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దీపికా, రణ్‌వీర్‌ రెండో బిడ్డ రాక వార్త బయటకు వచ్చిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి

Original source: prabhanews.com
Read more on Kaizer News