Kaizer News

ఇక యాక్షన్‌ మోడ్‌లోకి..

ఇక యాక్షన్‌ మోడ్‌లోకి..

· Entertainment · ntnews.com

అగ్ర హీరో ఎన్టీఆర్‌కు గాయం కారణంగా ఆయన తాజా చిత్రం ‘డ్రాగన్‌’ షూటింగ్‌కు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఎన్టీఆర్‌ ఆరు వారాల విశ్రాంతిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన దాదాపుగా కోలుకున్నారని తెలిసింది. అక్టోబర్‌ మొదటి వారంలో ఆయన ‘డ్రాగన్‌’ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని టాక్‌. దీంతో ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అనుకున్న విధంగా వచ్చే ఏడాది జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో చిత్రబృందం ఉందని, దాంతో ఎన్టీఆర్‌ లేని సన్నివేశాలను ఈ నెలలోనే చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌ గాయం కారణంగా షూటింగ్‌ ఏమాత్రం ఆలస్యం కాదని, అక్టోబర్‌లో ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మరింత స్పీడ్‌గా చిత్రీకరణ జరుపుతామని మేకర్స్‌ ధీమాగా అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News