Kaizer News

Malkajgiri: మల్కాజిగిరిలో అధికారులతో మున్సిపల్ కమి

Malkajgiri: మల్కాజిగిరిలో అధికారులతో మున్సిపల్ కమిషనర్ సమీక్ష!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Malkajgiri: ఆర్‌కే పురం వంతెన, రహదారి కింది వంతెన నిర్మాణ పనుల పురోగతిని వేగవంతం చేసేందుకు మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం మల్కాజిగిరి ప్రాంతీయ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, ప్రభావిత ఆస్తుల యజమానులకు సంబంధించిన ప్రక్రియలపై అధికారులు కమిషనర్‌కు వివరించారు. ప్రాజెక్టు పరిధిలో ప్రభావితమయ్యే ఆస్తుల యజమానుల నుంచి ఆస్తి అభివృద్ధి హక్కుల బదిలీ దరఖాస్తులు, సమ్మతి తదితర ప్రక్రియలపై సమావేశంలో చర్చించారు.పెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తించి,ఆస్తుల యజమానులతో సమన్వయం చేసుకుంటూ వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌,న్యాయ విభాగాల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి, ఒక విభాగంలో పెండింగ్‌ కారణంగా పనులకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. ప్రభావిత ఆస్తుల యజమానులతో అవసరమైన చర్చలు నిర్వహించి,సమ్మతి,ఆస్తి అభివృద్ధి హక్కుల బదిలీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను నిబంధనల ప్రకారం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌ కేసులను అంశాల వారీగా పరిశీలించి,వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ సూచించారు.ఆర్‌కే పురం వంతెన,రహదారి కింది వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి, రహదారి భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల పురోగతిపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ, పెండింగ్‌ అంశాలను త్వరితగతిన పరిష్కరించి పనుల్లో గణనీయమైన పురోగతి సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రాంతీయ కమిషనర్‌ సంచిత్‌ గంగ్వార్‌,ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ప్రదీప్‌ కుమార్‌, ప్రధాన ఇంజినీర్‌ శ్రీనివాస్‌రావుతో పాటు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌,న్యాయ విభాగాల అధికారులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News