ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఏ సినిమా నిలుస్తుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. 99వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2027) కోసం భారత్ నుంచి మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం 33 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. చివరకు సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ను ఎంపిక చేసింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. […]