Cyprus coast : సైప్రస్ తీరంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఫెర్రీ (బోటు) బోల్తా పడింది. ఈ ఫెర్రీలో 267 మంది ఉండగా.. 100 మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది. సైప్రస్ రవాణా శాఖ మంత్రి ఎర్హాన్ అరిక్లి వెల్లడించిన వివరాల ప్రకారం.. సైప్రస్‌లోని కిరెనియా (గిర్నె) పోర్టు నుంచి ఒక ఫెర్రీ టర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్‌లో ఉన్న టసుకు పోర్టుకు బయల్దేరింది. ఈ ఫెర్రీలో మొత్తం 267 మంది ఉన్నారు. వీరిలో 259 మంది ప్రయాణికులుకాగా.. 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఫెర్రీ బయల్దేరిన కొద్దిసేపటికే, తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే బోల్తాపడింది. దీంతో అందులోని ప్రయాణికులు నీళ్లలో కొట్టుకుపోయారు. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. లైఫ్ జాకెట్ల సాయంతో నీళ్లపైనే తేలియాడుతూ తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. దీని గురించి వెంటనే సమాచారం అందుకున్న నార్తర్న్ సైప్రస్, టర్కిష్ రిపబ్లిక్‌కు చెందిన రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి. బాధితుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే 100 మందికిపైగా రక్షించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సైప్రస్ యురోపియన్ యూనియన్‌లో భాగంగా కొనసాగుతోంది