మంత్రి పొంగులేటి, హరీష్ రావు స్వార్థ రాజకీయాలు చేశారని ఆరోపించారు. హరీష్ రావు ముఖ్యమంత్రి, పొంగులేటిని రియల్టర్లుగా తీవ్రంగా దూషించారు. వారంలోగా 22A భూములు తొలగించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. Ponguleti Vs Harish Rao | హైదరాబాద్: తెలంగాణలో మంత్రి పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నట్లుగా విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. తనపై ఆరోపణలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవులు, స్వార్థ ప్రయోజనాల కోసం హరీష్ రావు ఎంత నీచానికైనా దిగజారతారని తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని అన్నారు. గతంలో యువకులను రెచ్చగొట్టి శవ రాజకీయం చేశారని, ఆ తర్వాత మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అనైతికంగా ఆసుపత్రులతో పాల వ్యాపారాలు నడిపారని ఆరోపించారు. సొంత పార్టీని కబ్జా చేసేందుకు కేసీఆర్ పై క్షుద్రపూజలు చేయించారంటూ స్వయంగా ఆయన కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, హరీష్ రావు వ్యక్తిత్వం ఎలాంటిదో ఇది స్పష్టం చేస్తోందన్నారు. తనపై ఉన్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిరోజూ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు ఆయన మాటలను నమ్మరని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో జరిగిన దొరల దోపిడీని ఖచ్చితంగా బయటకు తీస్తామని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ గుడిసెలు లేని తెలంగాణను నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఓం.. భీమ్.. బుష్.. హరీష్… పదవుల కోసం, పైసల కోసం హరీష్ రావు ఎంత నీచానికైనా దిగజారుతారనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆనాడు అగ్గిపెట్టె లేదంటూ యువకులను రెచ్చగొట్టి శవ రాజకీయాలు చేసిన @BRSHarish ... అధికారంలో ఉన్నప్పుడు పైసల కోసం మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అనైతికంగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసే కుట్రలు ఈ సంకల్పాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఎన్ని అపవాదులు మోపినా కాంగ్రెస్ ప్రభుత్వం తన సంక్షేమ, అభివృద్ధి లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు. ఇద్దరు రియల్టర్ల చేతిలో తెలంగాణ నాశనం.. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలాంటి రియల్టర్ల చేతిలో తెలంగాణ రాష్ట్రం చిన్నభిన్నమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పేదలు, రైతుల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం వారి కడుపు కొడుతోందని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాధితుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ఎలాంటి దరఖాస్తులు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి నివాస గృహాలను రాత్రికి రాత్రే 22A జాబితా నుంచి తొలగించారని, అదే రీతిలో రాష్ట్రంలోని సామాన