Kaizer News

Bigg Boss: ఒక్కటే ఫ్రేమ్‌లో నలుగురు సౌత్ సూపర్‌స్ట

Bigg Boss: ఒక్కటే ఫ్రేమ్‌లో నలుగురు సౌత్ సూపర్‌స్టార్లు... బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ లాంచ్!

· National - India · v6velugu.com

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' సందడి కౌంట్ డౌన్ మొదలైంది. అది కూడా దక్షిణాది బుల్లితెరపై ఇప్పటివరకు చూడని ఒక అద్భుతమైన వినోద విప్లవం ఆరంభం కాబోతోంది. బిగ్ బాస్ లవర్స్ కోసం ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఏకంగా నాలుగు భాషల్లో ఒకేసారి రెడీ అయ్యాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 'బిగ్‌బాస్' కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నాలుగు భాషల బిగ్‌బాస్ హోస్ట్స్ గా చేస్తున్న సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. తెలుగు స్టార్ కింగ్ నాగార్జున, తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కన్నడ బాద్‌షా కిచ్చా సుదీప్, మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఒకే ప్రమోషనల్ వీడియోలో కనిపించి ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ ప్రోమో కాన్సెప్ట్ చాలా ఫన్నీగా , ఆసక్తికరంగా డిజైన్ చేశారు. నలుగురు హోస్ట్‌లు ఒకేచోట టిఫిన్ ఆర్డర్ చేస్తారు. అయితే, ఒకరు ఆర్డర్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ మరొకరికి వస్తుంది.. అంటే ఒకరి ప్లేట్‌లో మరొకరి ఫుడ్ ప్రత్యక్షమవుతుంది. 'నాలుగు వేర్వేరు ఇళ్ళు, నాలుగు వేర్వేరు భాషలు.. కానీ వినోదం మాత్రం ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఏకకాలంలో అందించబోతున్నాం' అనే డ్రామాను ఈ కన్ఫ్యూజన్ ద్వారా చాలా క్రేజీగా చూపించారు.. 'ఫోర్ సూపర్‌స్టార్స్.. ఫోర్ హౌసెస్.. వన్ ఎపిక్ మోమెంట్' అంటూ బిగ్ బాస్ మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా నాలుగు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకే ప్రమోషన్‌లో కనిపించడం ఫ్యాన్స్‌లో ఆసక్తిని మరింత పెంచింది. ఈ నాలుగు రీజినల్ ఎడిషన్లు ఒకే రోజున.. సెప్టెంబర్ 6వ తేదీన చాలా గ్రాండ్‌గా ప్రీమియర్ కాబోతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఇదొక బిగ్గెస్ట్ హిస్టారిక్ మూమెంట్‌గా నిలవనుంది. ప్రస్తుతం నెట్టింట ఈ నలుగురు హీరోల లుక్స్, బాండింగ్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నాగార్జున గ్లామరస్ హోస్టింగ్, మోహన్‌లాల్ క్లాస్, విజయ్ సేతుపతి రా ఆటిట్యూడ్, సుదీప్ డైనమిక్ ప్రెజెన్స్ కలసి సౌత్ బుల్లి తెరలను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త కంటెస్టెంట్లు ఎవరు? ఎలాంటి రూల్స్ మార్చబోతున్నారు? అనే ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్లో పీక్స్‌కు చేరింది. సెప్టెంబర్ 6 నుండి రియాలిటీ షోల చరిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదు కాబోతున్నాయి

Original source: v6velugu.com
Read more on Kaizer News