Kaizer News

Nacharam: నాచారం ఎక్సైజ్ స్టేషన్ కొత్త ఇన్‌స్పెక్ట

Nacharam: నాచారం ఎక్సైజ్ స్టేషన్ కొత్త ఇన్‌స్పెక్టర్‌గా బాలరాజ్ బాధ్యతలు!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Nacharam: నాచారం ఎక్సైజ్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాలరాజ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఓంకార్ గౌడ్ నాగర్‌కర్నూల్ జిల్లాకు బదిలీ అయ్యారు. పదోన్నతిపై నాచారం ఆబ్కారీ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన బాలరాజ్ వెంటనే స్టేషన్‌లో మౌలిక వసతుల కల్పన, నవీకరణ పనులపై దృష్టి సారించారు. కాగా, నాచారం ఆబ్కారీ స్టేషన్‌లో ఎస్సైలుగా పనిచేసిన నరేష్‌రెడ్డి, శ్రీనివాసులు కూడా బదిలీ అయ్యారు. వారి స్థానంలో సి.హెచ్. రాఘవేంద్ర, పి. శివకృష్ణలు నూతన ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆబ్కారీ శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా అధికారులకు స్థానచలనం కలిగింది

Original source: hmtvlive.com
Read more on Kaizer News