Kaizer News

Watch: ఎఫ్‌డీఏ అధికారిని చుట్టుముట్టిన జనం.. గడువు

Watch: ఎఫ్‌డీఏ అధికారిని చుట్టుముట్టిన జనం.. గడువు ముగిసిన బిస్కెట్లు తినాలని బలవంతం

· National - India · ntnews.com

ముంబై: గడువు ముగిసిన స్నాక్ మిక్స్ తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు ఫిర్యాదు చేయడంతో ఆ అధికారి అక్కడకు చేరుకున్నారు. జనం ఆయనను చుట్టుముట్టారు. గడువు ముగిసిన బిస్కెట్లను తినాలని బలవంతం చేశారు. (Food Body Officer Cornered) ఆ అధికారి లంచం తీసుకుని షాపు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరగింది. ఒక షాపులో స్నాక్ మిక్స్ కొనుగోలు చేసి తిన్న తర్వాత రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, ఆ షాపులో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఎఫ్‌డీఏ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ షాపును తనిఖీ చేసేందుకు ఒక ఎఫ్‌డీఏ అధికారి అక్కడకు చేరుకున్నారు. ఆ దకాణంలో గడువు ముగిసిన బిస్కెట్‌ ప్యాకెట్లను అమ్ముతున్నట్లు తనిఖీలో ఆయన గుర్తించారు. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే తనిఖీ ప్రారంభానికి ముందే చిన్నారి అస్వస్థతకు కారణమైన గడువు ముగిసిన స్నాక్ మిక్స్‌ ప్యాకెట్లను ఆ షాపు నుంచి తొలగించినట్లు స్థానికులు ఆరోపించారు. అలాగే గడువు ముగిసిన బిస్కెట్ల ప్యాకెట్లను గుర్తించినప్పటికీ ఆ దుకాణదారుడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై వారు ఆగ్రహించారు. ఆ అధికారి లంచం తీసుకుని ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఏ అధికారిని జనం చుట్టుముట్టారు. గడువు ముసిగిన ఆ బిస్కెట్లు సురక్షితమైతే ఆయన తినాలని సవాల్‌ చేశారు. గడువు ముగిసిన బిస్కెట్లను ఆ అధికారి నోటిలో బలవంతంగా పెట్టేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది

Original source: ntnews.com
Read more on Kaizer News