Kaizer News

రుతురాజ్‌, పడిక్కల్‌ను ఎందుకు పక్కన పెట్టారు? వన్డ

రుతురాజ్‌, పడిక్కల్‌ను ఎందుకు పక్కన పెట్టారు? వన్డే జట్టులో చోటు దక్కకపోవడానికి అసలు కారణం ఇదే!

· National - India · hmtvlive.com

Ruturaj Gaikwad: భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవలేదు. ముఖ్యంగా దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో అదరగొడుతున్న పలువురు బ్యాటర్లు జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అందులో రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఇద్దరికీ మంచి వన్డే రికార్డు ఉన్నప్పటికీ.. టీమ్‌ఇండియా వన్డే ప్రణాళికల్లో మాత్రం ప్రస్తుతం చోటు దక్కడం లేదు. అసలు కారణమేంటి? రుతురాజ్‌ గైక్వాడ్‌ విషయంలో అతడి ఫామ్‌పై పెద్దగా సందేహాలు లేవు. దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడిన గత వన్డే సిరీస్‌లో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో 113 పరుగులు చేశాడు. సగటు 56.50గా ఉండగా.. స్ట్రైక్‌రేట్‌ 116.49గా నమోదైంది. రెండో వన్డేలో రాయ్‌పుర్‌ వేదికగా 105 పరుగుల శతకం సాధించాడు. అయితే ఆ మ్యాచ్‌లో రుతురాజ్‌ తన సహజమైన ఓపెనింగ్‌ స్థానంలో కాకుండా నంబర్‌-4లో బ్యాటింగ్‌ చేశాడు. ఆ ప్రయోగం అతడిని మిడిలార్డర్‌లో దీర్ఘకాలికంగా ఉపయోగించాలనే నమ్మకాన్ని సెలెక్టర్లకు కలిగించలేదని తెలుస్తోంది. శుభ్‌మన్‌ గిల్‌ అందుబాటులో లేని సమయంలో రుతురాజ్‌ను ప్రధానంగా బ్యాకప్‌ ఓపెనర్‌గా జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే అతడిని మిడిలార్డర్‌ బ్యాటర్‌గా కాకుండా ఓపెనింగ్‌ ఆప్షన్‌గా పరిగణించినట్లు అర్థమవుతోంది. ఇదే ఇప్పుడు రుతురాజ్‌కు సమస్యగా మారింది. ఓపెనర్‌గా ఆడే అవకాశం లేకపోతే.. అతడిని మరో స్థానంలోకి మార్చి ఆడించడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదని సమాచారం. భారత వన్డే జట్టులో ప్రస్తుతం టాప్‌ ఆర్డర్‌ స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ వంటి ఆటగాళ్లతో పాటు యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. దీంతో రుతురాజ్‌కు సహజమైన ఓపెనింగ్‌ స్థానం ఖాళీ కావడం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో విరాట్‌ కోహ్లీ నంబర్‌-3లో కొనసాగుతున్నాడు. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ వంటి ఆటగాళ్లకు ప్రాధాన్యం ఉంది. దేవదత్‌ పడిక్కల్‌ కథ కూడా కొంతవరకు ఇదే. ఎడమచేతి వాటం బ్యాటర్‌ అయిన పడిక్కల్‌ ప్రధానంగా ఓపెనర్‌గా లేదా టాప్‌ ఆర్డర్‌లో ఆడటానికే అలవాటు పడ్డాడు. అందువల్ల మిడిలార్డర్‌లో ఖాళీ ఏర్పడితే వెంటనే పడిక్కల్‌ను తీసుకోవడం సాధ్యం కాదు. అతడికి అవకాశం రావాలంటే ఓపెనింగ్‌ స్థానాల్లో ఒకటి ఖాళీ కావాల్సి ఉంటుంది. వన్డే అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ.. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో పడిక్కల్‌ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 2025-26 విజయ్‌ హజారే ట్రోఫీలో అతడు భారీగా పరుగులు సాధించాడు. ఒక దశలో విజయ్‌ హజారే ట్రోఫీలో అతడి సగటు 90కిపైగా ఉండటం అతడి స్థిరమైన బ్యాటింగ్‌కు నిదర్శనం. అంతకుముందు కూడా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరుసగా భారీ స్కోర్లు సాధించాడు. అయినా వన్డే జట్టులోకి అతడిని తీసుకురావడానికి సెలెక్టర్లు తొందరపడటం లేదు. కారణం.. ఇప్పటికే ఉన్న ఓపెనింగ్‌ కాంబినేషన్‌ను అనవసరంగా మార్చకూడదనే ఆలోచనే. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ఇండియా ఇప్పటి నుంచే ఒక స్థిరమైన కాంబినేషన్‌ తయారు చేసుకోవాలని చూస్తోంది. ఓపెనింగ్‌ స్థానంలో రోహిత్‌

Original source: hmtvlive.com
Read more on Kaizer News