టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఎలిజిబిలిటీ: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ పూర్తిచేసి ఉండాలి. హై-స్పీడ్ అనలాగ్, డిజిటల్ వీఎల్‌ఎస్‌ఐ సర్క్యూట్ల రూపకల్పన, డీబగ్గింగ్‌లో ఏడాది అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 29 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.tifr.res.in ను సందర్శించండి