Kaizer News

నేషనల్ హైవేపై సర్వీసు రోడ్డు కావాలని కేంద్ర మంత్రి

నేషనల్ హైవేపై సర్వీసు రోడ్డు కావాలని కేంద్ర మంత్రికి వినతి

· National - India · v6velugu.com

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని నేషనల్​ హైవే 44పై డబుల్​ బెడ్​రూం ఇండ్లు, మాడల్​ స్కూల్, ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లేందుకు సర్వీస్​ రోడ్డు నిర్మాంచాలని పెబ్బేరు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అలంపూర్​ వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పట్ణ శివారులోని బైపాస్​ వద్ద బీజేపీ పట్ణణ శాఖ నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్వీస్​ రోడ్డు, ఫ్లై ఓవర్​ బ్రిడ్జి లేనందున జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలను మంత్రికి వివరించారు. వెంటనే సర్వీస్​ రోడ్డు లేదా అండర్​ పాస్​ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు క్రాంతి కుమార్, జిల్లా కౌన్సిల్​ సభ్యుడు రంగస్వామి గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు, నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాఘవేంద్ర గౌడ్, రామకృష్ణ యాదవ్, శివ, రమేశ్, వేణుగోపాల్, అరవింద్, గంధం శివ, నాగరాజు యాదవ్, వెంకటేశ్, కేశవులు, నర్సోజి, సర్వేశ్వర్ గౌడ్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News