నకిలీ, ట్యాంపరింగ్ చేసిన లేదా నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లతో తిరిగే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా గత వారంలో 6 క్రిమినల్ కేసులు నమోదు చేసి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. HSRP నంబర్ ప్లేట్లు మాత్రమే ఉపయోగించాలని పోలీసులు స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్ మార్చడం, నంబర్లు కనిపించకుండా చేయడం లేదా అనధికారిక ప్లేట్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు