సాధారణంగా బంగారం అనగానే మనకు కొన్ని గ్రాముల నాణాలు, గొలుసులు లేదా కొన్ని వందల గ్రాముల బిస్కట్లు గుర్తొస్తాయి. కానీ, ఏకంగా అర టన్ను కంటే ఎక్కువ బరువున్న ఒక్కటే బంగారు ఇటుకను చూస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే వింతగా ఉంది కదూ! మీరు ఊహించలేరు కూడా, ఒక్క వ్యక్తి కాదు కదా, నలుగురు కలిసినా కూడా దీనిని కదపలేరు. ఇక దీనిని ఎత్తడమే అసాధ్యం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థే దీనికి సంబంధించిన ఒక వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @guinnessworldrecordsలో షేర్ చేసింది