Kaizer News

ముగుస్తున్న ‘ఫరక్కా’ గడువు.. ముంచుకొస్తున్న జలయుద్

ముగుస్తున్న ‘ఫరక్కా’ గడువు.. ముంచుకొస్తున్న జలయుద్ధం!

· National - India · sakshi.com

పశ్చిమ బెంగాల్‌లో గంగా నదిపై నిర్మించిన ఫరక్కా బ్యారేజీ జలాల గమనాన్నే కాదు.. రెండు దేశాల సంబంధాలు, రెండు రాష్ట్రాల భవితవ్యాన్నీ సమూలంగా మార్చేసింది. కోల్‌కతా పోర్టును కాపాడేందుకు రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు 1996 నాటి చారిత్రక 30 ఏళ్ల ఒప్పందం 2026 డిసెంబర్‌తో ముగియనుండటంతో పెను వివాదం రాజుకుంది. బీహార్ వరదలు, పశ్చిమ బెంగాల్ పోర్టు మనుగడ, బంగ్లాదేశ్ నీటి అవసరాల మధ్య ఫరక్కా నీటిపై అసలు హక్కు ఎవరిదన్న ప్రశ్న ఇప్పుడు రచ్చ లేపుతోంది. కోల్‌కతా పోర్టు రక్షణకే ఆనాడు పునాది హుగ్లీ నదిలో పేరుకుపోతున్న విపరీతమైన పూడిక కారణంగా నది లోతు తగ్గి, భారీ నౌకలు కోల్‌కతా పోర్టు కు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 1853లోనే బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించినట్లుగా.. గంగా నది నీటిని హుగ్లీ వైపు మళ్లిస్తే పూడిక కొట్టుకుపోయి పోర్టు నిరంతరం పనిచేస్తుందని నిపుణులు నిర్ణయించారు. దీని ఫలితంగానే 1975లో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో, బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 16-18 కిలోమీటర్ల ఎగువన 109 గేట్లతో 2.25 కిలోమీటర్ల పొడవైన ఫరక్కా బ్యారేజీని నిర్మించారు. ఇక్కడి నుంచి 38-42 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ ద్వారా గంగ నీటిని భాగీరథి-హుగ్లీ నదిలోకి మళ్లించడం ప్రారంభించారు. నీటి కొరతతో రగిలిన వివాదం ఫరక్కా నుంచి హుగ్లీ వైపు నీటిని మళ్లించడంతో బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే పద్మా నదిలో ప్రవాహం గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా ఎండాకాలంలో తీవ్ర నీటి కొరత ఏర్పడి బంగ్లాదేశ్‌లో వ్యవసాయం, మత్స్య సంపద, తాగునీరు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సమస్య భారత్-బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘ దౌత్య వివాదానికి దారితీసింది. 1977, 1980లలో తాత్కాలిక ఏర్పాట్లు జరిగినప్పటికీ, చివరకు 1996 డిసెంబర్ 12న నాటి భారత ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య 30 ఏళ్ల కాలపరిమితితో ‘గంగా జలాల పంపకాల ఒప్పందం’ కుదిరింది. 1996 నాటి పంపకాల ఫార్ములా ఇదే ఈ చారిత్రక ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1 నుంచి మే 31 వరకు ఉండే ఎండాకాలంలో నీటి పంపకాలను పక్కాగా నిర్వచించారు. ఫరక్కా వద్ద 70,000 క్యూసెక్కులు లేదా అంతకంటే తక్కువ నీరు లభిస్తే ఇరు దేశాలు చెరిసగం పంచుకోవాలి. 70,000 నుంచి 75,000 క్యూసెక్కుల లభ్యత ఉంటే బంగ్లాదేశ్‌కు 35,000 క్యూసెక్కులు ఇచ్చి మిగిలినది భారత్ తీసుకోవాలి. 75,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంటే భారత్‌కు 40,000 క్యూసెక్కులు కేటాయించి మిగిలినది బంగ్లాదేశ్‌కు విడుదల చేయాలి. మార్చి-మే మధ్య ఇరు దేశాలకు వంతులవారీగా 35,000 క్యూసెక్కుల కనీస ప్రవాహాన్ని ఇచ్చే గ్యారెంటీని కూడా ఇందులో చేర్చారు. బంగ్లాదేశ్ కొత్త డిమాండ్లు.. అంతర్జాతీయ ఒత్తిడి సుదీర్ఘకాలం సాఫీగానే సాగిన ఈ వ్యవస్థలో బంగ్లాదేశ్‌ లో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాక తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా పెరగడం, వాతావరణ మార్పులు, వర్షపాత లేమి దృష్ట్యా తమకు మరింత ఎక్కువ నీరు కావాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. ఎగువ దేశం నుంచి నిర్ణీత పరిమాణంలో నీటి విడుదలను తప్పనిసరి చేసే ‘గ్యారెంటీ క్లాజ్’ కొత్త ఒప్పందంలో ఉండాలని ఆ దేశ జలవనరుల శాఖ మంత్రి షాహి

Original source: sakshi.com
Read more on Kaizer News