ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ప్రస్తుతం ఎన్నో రకాల ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 5G డేటా, OTT సబ్‌స్క్రిప్షన్లు కావాలనుకునే వారికి కొన్ని ప్లాన్స్ ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ కథనంలో రోజుకు 2.5GB డేటా లభించే మూడు ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. రూ.399 ప్లాన్ ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2.5జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 70జీబీ డేటాను వినియోగించుకోవచ్చన్నమాట. అన్‌లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. దీంతో పాటు 28 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్ లభిస్తాయి. రూ.1,199 ప్లాన్ ఎక్కువ కాలం రీచార్జ్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5జీబీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. సబ్‌స్క్రైబర్‌లు ప్లాన్ కాల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. రోజువారీ డేటా పరిమితి అయిపోగానే, మరుసటి రోజు వరకు ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది. రూ.3,999 ప్లాన్ తరచూ రీచార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి రూ.3,999 ప్లాన్ మంచి ఆప్షన్. ఈ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రీఛార్జ్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనంగా మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఏ ప్లాన్ తీసుకోవాలి? నెలనెలా రీచార్జ్ చేసుకునే అలవాటు ఉన్నవారికి రూ.399 ప్లాన్ సరిపోతుంది. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఏడాది పాటు ఒకే రీచార్జ్‌తో డేటా, కాలింగ్, 5జీ సేవలు కొనసాగాలనుకునే వారికి రూ.3,999 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం