ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు 10లో రెండో వారం ముగిసే సమయానికి హౌస్‌లో వేడి మరింత పెరిగింది. శనివారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కొక్కరి ఆట తీరును బయటపెట్టారు. ఎవరు ఎక్కడ తప్పు చేశారు? ఎవరి గేమ్ ఎలా ఉంది? అనే విషయాలను వీడియోలు, టాస్కుల ఆధారంగా కంటెస్టెంట్ల ముందే చర్చించారు. ముందుగా ఈ వారం ఇంట్లో కనిపించకుండా ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లపై నాగార్జున ఫోకస్ పెట్టారు. శ్రిష్టి, కృష్ణుడు ఆటలో పెద్దగా యాక్టివ్‌గా లేరంటూ వారి గేమ్‌పై ప్రశ్నలు వేశారు. ఇద్దరినీ కాసేపు పక్కన కూర్చోబెట్టి.. హౌస్‌లో జరుగుతున్న ఆటను చూస్తూ ఉండటం మాత్రమే కాకుండా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలని సూచించారు. ఆ తర్వాత హౌస్‌లో ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తున్నారు అనే దానిపై ‘మాస్టర్, పప్పెట్’ టాస్క్ నడిచింది. చరణ్.. వర్షిణి మాస్టర్, సుధీర్ పప్పెట్ అని చెప్పాడు. అయితే వర్షిణి మాత్రం తాను సుధీర్‌ను కంట్రోల్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.ఇదే సమయంలో గతంలో జరిగిన టాస్క్‌లో చరణ్ వ్యవహరించిన తీరుపైనా నాగార్జున మాట్లాడారు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోకుండా తనదైన స్ట్రాటజీగా భావించకూడదని చరణ్‌కు సూచించారు.రామ్ ప్రసాద్ మాత్రం త్రిగుణ్ మాస్టర్, వంశీ పప్పెట్ అని చెప్పాడు. ఈ మాటకు ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. దీంతో హౌస్‌లో త్రిగుణ్-వంశీ కాంబినేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్‌గా వర్షిణి తీసుకున్న నిర్ణయం కూడా నాగార్జున ముందుకు వచ్చింది. ముఖ్యంగా ముఖేష్‌కు అనుకూలంగా ఆమె నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి.వంశీ చెప్పిన పాయింట్‌ను పట్టించుకోకుండా రోహిత్ చెప్పిన మాటను ఎందుకు నమ్మావంటూ నాగార్జున ప్రశ్నించారు. సంచాలక్‌గా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఒకరి వైపు నిలబడటం సరికాదని చెప్పడంతో వర్షిణికి పెద్ద షాక్ తగిలింది.ఈ సీజన్‌లో ఇకపై ఆమెను సంచాలక్‌గా పెట్టబోమంటూ నాగార్జున ప్రకటించారు. వర్షిణి, షాలినీ మధ్య జరిగిన గొడవను కూడా నాగార్జున వదల్లేదు. గొడవ సమయంలో షాలినీ ఎక్కువగా ముందుకు వెళ్లిందని ఆయన చెప్పారు.వర్షిణి టచ్ చేసినంత మాత్రాన షాలినీ అలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని నాగార్జున స్పష్టం చేశారు. ఎదుటివాళ్లకు ఉన్న హక్కులే తనకూ ఉన్నాయని, అదే విధంగా తనకు ఉన్న హక్కులు వాళ్లకూ ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.కోపం వచ్చిన ప్రతిసారీ వెంటనే రియాక్ట్ కాకుండా కాస్త కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. దీంతో షాలినీ ఎమోషనల్ అయిపోయింది. హౌస్‌లో వంశీ ఎక్కువగా అరుస్తున్నాడనే విషయాన్ని కూడా నాగార్జున ప్రస్తావించారు. వంట విషయంలో ఇతరులతో మాట్లాడే తీరు మార్చుకోవాలని సూచించారు.వంట చేసే వాళ్లను తిడుతూ, అరుస్తూ కాకుండా కాస్త ప్రశాంతంగా మాట్లాడాలని చెప్పారు. ఫుడ్ అనేది ప్రేమగా తయారు చేసి, ప్రేమగా వడ్డించాల్సిన విషయం అంటూ వంశీకి నాగార్జున చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఎపిసోడ్‌లో మరో హైలైట్ రోహిత్‌పై నాగార్జున చేసిన కామెంట్స్. టాస్క్‌లో రోహిత్ వ్యవహరించిన తీరుపై ఆడియెన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు.త్రిగుణ్ రెచ్చగొట్టాడని తాను కూడా రెచ్