ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా రెండు వారాలకు మించి ఆడడం లేదు. అది కూడా హిట్ టాక్ వస్తేనే. ఇక యావరేజ్ టాక్ వస్తే.. మూడు రోజులకే థియేటర్స్ నుంచి ఖాలీ చేస్తున్నారు. అలాంటిది ‘ఇరుముడి’ చిత్రం నెల రోజులుగా థియేటర్స్‌లో రన్ అవుతూ.. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా కోసం థియేటర్స్‌కి వెళ్తున్నారు. అంతలోనే ఓటీటీలోకి వదిలేశారు మేకర్స్. ఫలితంగా ఈ చిత్రం ఓ మంచి రికార్డును కోల్పోయింది. 100 కోట్ల రికార్డు మిస్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం ఆగస్ట్ 21న థియేటర్స్‌లో విడుదలైంది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి థియేటర్స్ అన్ని నిండిపోయాయి. అలా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇక మొత్తంగా రూ. 240 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అందులో ఒక్క నైజాం ఏరియా నుంచే రూ.90 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇంకో వారం ఆగితే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరేది. కానీ అంతలోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఫలితంగా నిన్నటి నుంచి ఈ సినిమాకు టికెట్స్ పెద్దగా తెగడం లేదు. ఇంట్లోకి వచ్చిన సినిమా కోసం థియేటర్స్‌కి వెళ్లడం కష్టమే. వారం రోజుల తర్వాత ఓటీటీలోకి వదిలితే.. రూ. 100 కోట్ల కలెక్షన్స్ ఈజీగా వచ్చేవని సినీ పండితులు అంటున్నారు. అలా అయితే నైజాంలో రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించిన అతి కొద్ది సినిమాల జాబితాలో ఇరుముడి కూడా చేరేది. రూ. 250 రికార్డు కోల్పోయింది ఇరుముడి చిత్రం మరో రికార్డును కూడా కోల్పోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 240 కోట్లు వసూలు చేసింది. ఈ వారం కూడా తెలుగులో పెద్ద సినిమాలేవి రిలీజ్ కాలేదు. విడుదలైన చిన్న చిత్రాలేవి హిట్ టాక్‌ని సంపాదించుకోలేదు. అలా చూస్తే.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి చిత్రం హవానే కొనసాగేది. ఈ నెల 24 వరకు అయితే కచ్చితంగా ఈ సినిమా థియేటర్స్‌లో ఆడేది. ఆ తర్వాత ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఈ సినిమాని పక్కన పెట్టేవారు. ఈ వారంలో ఓవరాల్‌గా రూ. 10 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం అయితే మెండుగా ఉంది. కానీ సడెన్‌గా ఓటీటీలో రిలీజ్ చేయడంతో.. ఇప్పుడు ఆ స్థాయి కలెక్షన్స్ రావడం కష్టమే. అలా వస్తే..రూ. 250 కోట్ల క్లబ్‌లో కూడా ఈ చిత్రం నిలిచేది. మొత్తంగా ఇరుముడి ఓ రెండు రికార్డులను అయితే కోల్పోయింది. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య YSR మేనత్త కమలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన YS భారతి రెడ్డి