నిన్నటిదాకా కేవలం బిర్యానీ సువాసనలకు, ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన భాగ్యనగరం.. ఇప్పుడు సరికొత్త గ్లోబల్ కల్చర్‌తో సరికొత్త రంగులు అద్దుకుంటోంది. ఒకవైపు వీకెండ్స్‌లో లైవ్ కామెడీ క్లబ్బుల నవ్వులు, ఓపెన్ మైక్స్‌లో మెరుస్తోన్న సరికొత్త టాలెంట్, మ్యూజిక్, కామెడీ ఫ్యూజన్ షోలతో నగర వినోద రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. మరోవైపు, స్థానిక రుచులతో పాటు థాయ్, జపనీస్, కాంటోనీస్ వంటి అంతర్జాతీయ వంటకాలతో కొత్త ఫుడ్ స్పాట్లు ఆహార ప్రియులను అలరిస్తున్నాయి. వీటన్నింటికీ మించి, సాంకేతిక రంగంలో ఐటీ నగరంగా దూసుకుపోతున్న హైటెక్ సిటీ.. ఇప్పుడు సరికొత్త ఏఐ స్టార్టప్‌లు, భారీ పెట్టుబడులతో గ్లోబల్ ‘ఏఐ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. హైదరాబాద్ లైఫ్ స్టైల్‌లో రీసెంట్‌గా ట్రెండ్ అవుతోన్న ఆ ఆసక్తికర విశేషాలు మీకోసం... హైదరాబాద్‌లో వీకెండ్ వినోదం సినిమా, పబ్‌లు, మ్యూజిక్‌కి మాత్రమే పరిమితం కాకుండా లైవ్ కామెడీ క్రేజీగా మారుతోంది. హాస్య ప్రదర్శనల్లో ప్రేక్షకులు కేవలం ప్రముఖ హాస్యనటుల స్టాండప్ కామెడీ, ఒపెన్ మిక్ ఓపెన్ మైక్స్, క్రౌడ్-వర్క్, మ్యూజికల్ కామెడీ వంటి కొత్త ఫార్మాట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. వీకెండ్ అంటే కేవలం సినిమా లేదా రెస్టారెంట్‌కు వెళ్లడం అనే పాత అలవాటు క్రమంగా మారుతోంది. స్టాండ్-అప్ కామెడీ, లైవ్ మ్యూజిక్, డీజే రాత్రులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, పాప్-అప్‌లు వంటి అనుభవాల కోసం యువత ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటోంది. నగరంలో ఈ మార్పుకు అనుగుణంగా హాస్య క్లబ్‌లు, ప్రత్యక్ష సంగీత వేదికలు, ఈవెంట్ స్పేస్‌లు కూడా పెరుగుతున్నాయి. గచ్చిబౌలిలో ది స్ట్రీట్ కామెడీ క్లబ్, మాదాపూర్‌లో హైదరాబాద్ కామెడీ క్లబ్, జూబ్లీహిల్స్‌లో హాస్య-కేంద్రీకృత వేదికలు యువతతో సందడిగా మారాయి. సినిమా నుంచి స్టాండ్ అప్ కామెడీ వరకు హైదరాబాద్ వీకెండ్ కల్చర్‌లో కొత్త ట్రెండ్ ఆరంభం అయింది. సెప్టెంబరు నెలలో నగరంలో ప్రముఖ స్టాండప్ కమెడియన్లు షమీక్ చక్రవర్తి, విపుల్ గోయల్, గోకుల్ కుమార్, అనుభవ్ సింగ్ లైవ్ కామెడీ షోలు జరగనున్నాయి.సినిమా తర్వాత కామెడీ థియేటర్ హైదరాబాద్ వీకెండ్‌కు కొత్త నవ్వుల చిరునామాగా మారాయి. వీకెండ్ సండేల్లో కాఫీ సిప్ చేస్తూ దాని అనుభూతిని పొందుతూ స్నేహితులతో గడపాలనుకునే వారు ఒక కప్పు కాఫీ.. కుదిరితే నాలుగు మాటలు అంటూ కాఫీ షాపుల్లో బారులు తీరుతున్నారు. వివిధ రుచుల కాఫీ తాగుతూ పుస్తకాలు చదవాలంటే దుర్గం చెరువు వద్ద నాద్ కొత్త గమ్యస్థానంగా మారింది. స్పెషాలిటీ కాఫీ కోసం బంజారాహిల్స్ లోని క్యాఫీన్ బిస్ట్రోకు వెళ్లాల్సిందే. కామిక్ పుస్తకాల స్ఫూర్తితో రూపొందించిన ఇంటీరియర్స్, సెల్ఫీలకు అనువైన ప్రదేశాలతో కూడిన రంగురంగుల, ఉత్సాహభరితమైన కేఫ్ ఖాజాగూడలోని ఆల్వేస్ సండేస్ సృజనాత్మక వ్యక్తుల సమూహానికి మంచి ఎంపిక. ప్రశాంతమైన, ప్రకృతి స్ఫూర్తితో కూడిన వాతావరణం చుట్టూ నిర్మించిన ఒక కొత్త కేఫ్ ఫిలింనగర్‌లోని ఆరెంజరీ, ఫైర్‌బ్యాక్‌లో నిప్పుల మీద కాల్చిన థాయ్ ఆహారం, దానితో పాటు బ్యాంకాక్ చైనాటౌన్ స్ఫూర్తితో రూపొందించిన కాక్‌టెయిల్ బార్ అయిన బ