Kaizer News

Chintal: చింతల్‌లో 11 కిలోల గంజాయి స్వాధీనం ఇద్దరు

Chintal: చింతల్‌లో 11 కిలోల గంజాయి స్వాధీనం ఇద్దరు అరెస్ట్!

· City - Hyderabad · hmtvlive.com

Chintal: చింతల్ ప్రధాన రహదారిపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌ఓటీ కూకట్‌పల్లి, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితులు విశాఖపట్నం నుంచి జీడిమెట్లకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 11 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.5.50 లక్షలు కాగా, రెండు మొబైల్ ఫోన్లు రూ.20 వేల విలువైనవిగా గుర్తించారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ.5.70 లక్షలు. అరెస్టైన వారు లో ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందిన మారేడుబుడి రాజు (33), హైదరాబాద్‌కు చెందిన సిరపు హేమ (41)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News