Kaizer News

Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌ

Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్‌లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్‌ బౌన్స్‌ కథ వింటే..

· National - India · ntvtelugu.com

రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్‌లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్‌ బౌన్స్‌ కథ వింటే.. : --> Add as a preferred source on google Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఓ మహిళ భక్తురాలు ఇచ్చిన రూ.4 కోట్ల భారీ విరాళం చెక్ బౌన్స్ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంత పెద్ద మొత్తానికి చెక్ ఇచ్చిన ఆమె బ్యాంకు ఖాతాలో మాత్రం కేవలం రూ.3 మాత్రమే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో అసలు ఆమె ఎందుకు ఇంత భారీ మొత్తానికి చెక్ ఇచ్చారు? ఆ చెక్ బౌన్స్ కావడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెన్నైకి చెందిన ఓ మహిళా భక్తురాలు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.4 కోట్ల చెక్ ఇచ్చారు. అయితే ఈ డబ్బును ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది సౌకర్యాలు, సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని కూడా కోరారు. అంతేకాదు ఈ మొత్తాన్ని అదే అవసరాలకు ఉపయోగిస్తామని ట్రస్ట్ నుంచి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కూడా ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ట్రస్ట్ నిబంధనల ప్రకారం ఒక దాత సూచించిన నిర్దిష్ట ప్రయోజనం కోసమే డబ్బును ఖర్చు చేస్తామని ప్రత్యేకంగా హామీ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు ఆమెకు వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె ఇచ్చిన రూ.4 కోట్ల చెక్కును ట్రస్ట్ బ్యాంకులో జమ చేసింది. చెక్ క్లియర్ చేసే ప్రక్రియలో ఖాతాను పరిశీలించిన బ్యాంకు అధికారులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. ఆ చెక్కుకు సంబంధించిన ఖాతాలో కేవలం రూ.3 మాత్రమే ఉన్నట్లు తేలింది. డబ్బు లేకపోవడంతో చెక్ కూడా బౌన్స్ అయింది. దీంతో ఖాతాలో నిధులు లేకపోయినా ఇంత భారీ మొత్తానికి చెక్ ఎందుకు ఇచ్చారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఈ విషయంపై మహిళకు నోటీసు ఇచ్చి వివరణ కోరేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఆమె ఆలయానికి పూర్తిగా విరాళం ఇవ్వలేదని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే రూ.4 కోట్ల చెక్‌తో పాటు మరో రూ.10 వేల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని ఆలయానికి అందజేసి రసీదు కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.4 కోట్ల చెక్‌కు సంబంధించిన వ్యవహారాన్ని ట్రస్ట్ ఆమెతో చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిరానికి వచ్చే విరాళాల పరిమాణం కూడా భారీగానే ఉంది. ప్రతి నెలా ఆలయానికి సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు విరాళాలు వస్తున్నట్లు సమాచారం. ఇందులో చెక్కుల రూపంలోనే నెలకు దాదాపు రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు విరాళాలు అందుతున్నాయి. రామ మందిర నిర్మాణం కోసం 2020లో నిర్వహించిన నిధి సమర్పణ అభియాన్ సమయంలో కూడా భారీ మొత్తంలో విరాళాలు సేకరించారు. దేశవ్యాప్తంగా 45 రోజుల పాటు సాగిన ఆ కార్యక్రమంలో దాదాపు రూ.3,500 కోట్లు సమీకరించినట్లు సమాచారం. ఆ సమయంలో కూడా కొన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. తర్వాత వాటిలో చాలా మొత్తాన్ని రికవరీ చేసినప్పటికీ, సుమారు రూ.22 కోట్ల వరకు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ తాజా ఘటనకు మరింత ప్రాధాన్యం రావడానికి మరో కారణం కూడా ఉంది. కొద్ది నెలల క్రితమే రామ మందిరం విరాళాల

Original source: ntvtelugu.com
Read more on Kaizer News