భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ భారతీయులకు గుడ్‌న్యూస్ 30 రోజులు వీసా ఫ్రీ ఎంట్రీ మోడీ టూర్ సందర్భంగా నిర్ణయం Follow Us : --> Add as a preferred source on google ప్రధాని మోడీ ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఉజ్బెకిస్థాన్ వెళ్లారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇక భారతీయులకు ఉజ్బెకిస్థాన్ కీలక గుడ్‌న్యూస్ చెప్పింది. భారత పౌరులకు 30 రోజుల పాటు వీసా లేకుండానే దేశంలోకి ప్రవేశించే అవకాశం కల్పించింది. ప్రధాని మోడీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది. ఈ చర్యతో పర్యాటకం, వ్యాపార సంబంధాలు, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ తెలిపారు. ఆదివారం తాష్కెంట్‌లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు మిర్జియోయెవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాలని నిర్ణయించారు. అలాగే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026లో భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఇరు దేశాల సంబంధాలకు మరింత విస్తృతమైన, ప్రతిష్టాత్మకమైన రూపాన్ని కల్పిస్తున్నామని మోడీ తెలిపారు. గత ఏడాది భారత్-ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తొలిసారిగా 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిందని మిర్జియోయెవ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య జాయింట్ వెంచర్ల సంఖ్య కూడా ఇటీవలి సంవత్సరాల్లో ఏకంగా ఏడు రెట్లు పెరిగిందని చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాలు, క్లీన్ ఎనర్జీ, అంతరిక్షం, అణు ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్-ఉజ్బెకిస్థాన్ చర్చల్లో అణు ఇంధన రంగం కూడా కీలకంగా నిలిచింది. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్‌కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మోడీ ప్రకటించారు. భారత్‌లో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకోనుంది. రక్షణ, భద్రతా సహకారంపైనా ఇరు దేశాల నేతలు చర్చించారు. రక్షణ రంగాల్లో ప్రత్యక్ష అనుసంధానాలు, ఉమ్మడి ఉత్పత్తి, సంయుక్త అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ప్రాంతానికి తీవ్రమైన సవాళ్లని.. వీటిని ఎదుర్కోవడంలో భారత్, ఉజ్బెకిస్థాన్ కలిసి పనిచేయాలని మోడీ అన్నారు. ఇంధనం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఆభరణాలు, సంస్కృతి వంటి రంగాల్లోనూ సహకారాన్ని పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ప్రస్తుతం వారానికి 14 నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయని మిర్జియోయెవ్ తెలిపారు. కొత్త వీసా రహిత విధానంతో పర్యాటకులు, వ్యాపార ప్రయాణికుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉజ్బెకిస్థాన్‌లో యోగా కూడా వేగంగా ప్