Kaizer News

సీఎం సొంత నియోజకవర్గంలో క‌విత పాంచజన్య సంకల్ప సభ..

సీఎం సొంత నియోజకవర్గంలో క‌విత పాంచజన్య సంకల్ప సభ..

· City - Hyderabad · prabhanews.com

రేవంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నుంచే ప్రభుత్వంపై ప్రశ్నలు సీఎం సొంత నియోజకవర్గంలో కవిత పాంచజన్య సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు కొడంగల్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీల అమలుపై కవిత ప్రశ్నలు రేవంత్‌ నియోజకవర్గం నుంచే ప్రభుత్వ విధానాలపై రాజకీయ సమరానికి కవిత సిద్ధం కోస్గి సభలో బహుజన తెలంగాణ లక్ష్యాలు, భవిష్యత్‌ ప్రణాళికలపై కవిత ప్రసంగం విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయమే ప్రధాన అజెండాగా పాంచజన్య సభ కొడంగల్‌ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ.. సభకు భారీగా ఏర్పాట్లు పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై కీలక ప్రకటనలకు వేదికగా పాంచజన్య సంకల్ప సభ కొడంగ‌ల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొడంగల్‌ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కోస్గి వేదికగా ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 20న మధ్యాహ్నం కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో జరిగే ఈ సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. సభకు ముందు కొడంగల్‌ నుంచి కోస్గి వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావం తర్వాత కవిత చేపడుతున్న రాజకీయ కార్యక్రమాల్లో కోస్గి సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో సభ నిర్వహించడం వల్ల సహజంగానే రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టడానికి, అలాగే బహుజన తెలంగాణ సాధన లక్ష్యంతో కవిత కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి వేదికగా పాంచజన్య సంకల్ప సభను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రశ్నించడం… ఆరు గ్యారంటీల్లో సగం కూడా అమలు కాలేదని నిలదీయడం… ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన రాజకీయ వ్యతిరేకతను, ఓటమే లక్ష్యంగా ఈ స‌భ ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రక్షణ సేన భవిష్యత్ కార్యాచరణ మరియు బహుజన తెలంగాణ బ్లూప్రింట్‌ను ప్రజలకు వివరించడం. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని ప్రజలకు భరోసా ఇవ్వడానికి క‌విత ఈ స‌భ‌ను ఉప‌యోగించుకోనున్నారు. అయితే పార్టీ దృష్టిలో ఈ సభ ప్రధానంగా తమ విధానాలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలు, భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణను ప్రజలకు వివరించే వేదికగా ఉంది. ఇప్పటికే తెలంగాణ రక్షణ సేన నిజామాబాద్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించింది. తదుపరి కార్యక్రమంగా కోస్గిని ఎంచుకుంది. అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలోనూ సభ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తరించే ప్రయత్నంలో భాగంగా కోస్గి సభను చూడవచ్చు. తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన ‘పాంచజన్యం’ ఐదు ప్రధాన అంశాల చుట్టూ ఉంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అంశాలను పార్టీ తన ప్రధాన కట్టుబాట్లుగా పేర్కొంది. విద్య విషయంలో ప్రతి గ్రామానికి పాఠశాల, ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని పార్టీ చెబుతోంది. ప్రైవేటు విద్యను అభ్యసించే విద్యార

Original source: prabhanews.com
Read more on Kaizer News