Kaizer News

Nepal Floods: నేపాల్ వ‌ర‌ద‌ల్లో 626కి చేరిన మృతుల

Nepal Floods: నేపాల్ వ‌ర‌ద‌ల్లో 626కి చేరిన మృతుల సంఖ్య

· National - India · ntnews.com

కాట్మాండు: నేపాల్ వ‌ర‌ద‌ల్లో(Nepal Floods) మృతిచెందిన వారి సంఖ్య 626కు చేరుకున్న‌ది. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఇవాళ నాలుగో రోజు కూడా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. వ‌ర‌దల్లో గ‌ల్లంతైన వారి సంఖ్య రెండు వేలు దాటింది. మ‌రో వైపు టిబెట్‌లో ఏర్ప‌డిన తాత్కాలిక స‌ర‌స్సులో నీటి మ‌ట్టం పెరుగుతోంది. దీని ప‌ట్ల ఇప్ప‌టికే చైనా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. రెండోసారి భారీ ఎత్తున బుర‌ద‌తో కూడిన వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. నేపాల్, టిబెట్ బోర్డ‌ర్‌లో ఉన్న గిరాంగ్ పోర్టు వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తున్న రెస్క్యూ బృందం ఆ స‌ర‌స్సుపై నిఘా పెట్టింది. ఆ స‌ర‌స్సు ప‌రిస‌ర ప్ర‌దేశాల‌ను డ్రోన్ల ద్వారా నిత్యం అంచ‌నా వేస్తోంది. రెస్క్యూ వ‌ర్క‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని చేర‌వేస్తోంది. ఇక చైనా మీడియా ప్ర‌కారం టిబెట్‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. 554 మంది గ‌ల్లంతు అయ్యారు

Original source: ntnews.com
Read more on Kaizer News